బండి సంజయ్ భర్త్ డే ప్లెక్సీల వివాదం... కరీంనగర్ లో ఉద్రిక్తత (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 11, 2021, 01:22 PM ISTUpdated : Jul 11, 2021, 01:34 PM IST
బండి సంజయ్ భర్త్ డే ప్లెక్సీల వివాదం... కరీంనగర్ లో ఉద్రిక్తత (వీడియో)

సారాంశం

తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ పట్టణంలో బిజెపి శ్రేణులు ఏర్పాటుచేసిన ప్లెక్సీలు వివాదానికి కారణమయ్యాయి.  

కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ నాయకులు కరీంనగర్ పట్టణంలో భారీగా ప్లెక్సీలు ఏర్పాటుచేయడం వివాదానికి దారితీసింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లపై ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఈ ప్లెక్సీలను ఏర్పాటుచేశారంటూ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది వీటిని తొలగించారు. దీంతో కార్పొరేషన్ అధికారులు- బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

వీడియో

ఇదిలావుంటే తెలంగాణ బిజెపి చీఫ్ కు భర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. '' బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడి ఆశిస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాంతం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా'' అంటూ ట్విట్టర్ వేదికన కిషన్ రెడ్డి విషెస్ తెలిపారు. 

నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా భర్త్ డే విషెస్ తెలిపారు. '' నా సహచరుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వలో తెలంగాణలో బిజెపి తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. ఈ సంవత్సరం మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా'' అంటూ అరవింద్ ట్వీట్ చేశారు. 


 
 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !