ఈ నెల 20 లోపుగా విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా :కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతు జేఏసీ డిమాండ్

By narsimha lode  |  First Published Jan 12, 2023, 3:43 PM IST

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  విలీన గ్రామాలకు  చెందిన కౌన్సిలర్లు ఈ నెల  20వ తేదీ లోపుగా  రాజీనామా చేయాలని  రైతు జేఏసీ డిమాండ్  చేసింది.  
 


నిజామాబాద్: ఈ నెల  20వ తేదీలోపుగా  విలీన గ్రామాల కౌన్సిలర్లు  తమ పదవులకు  రాజీనామాలు  చేయాలని  రైతు జేఏసీ డిమాండ్  చేసింది. కామారెడ్డి  కొత్త మాస్టర్ ప్లాన్ పై   లింగాపూర్ లో   రైతు జేఏసీ  నేతలు గురువారంనాడు  సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.  ఈ నెల  20వ తేదీలోపుగా కౌన్సిలర్లు రాజీనామాలు  సమర్పించకపోతే  కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని  రైతు జేఏసీ హెచ్చరించింది. ఈ నెల  15న మాస్టర్ ప్లాన్ పేరుతో ముగ్గులు వేసి నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఈ నెల  5వ తేదీన   కలెక్టరేట్ ఎదుట  రైతు జేఏసీ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది.  అంతకుముందు  రోజే అడ్లూరు ఎల్లారెడ్డికి  చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు ఆత్మహత్యకు మాస్టర్ ప్లాన్ కారణం కాదని  అధికారులు చెబుతున్నారు.మ మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి  చెందిన ఉపసర్పంచ్ సహా  తొమ్మిది మంది వార్డు సభ్యులు  రాజీనామాలు చేశారు.  ఈ నెల  6వ తేదీన కామారెడ్డి బంద్ కూడా నిర్వహించారు. ఈ బంద్ కు బీజేపీ, కాంగ్రెస్ లు మద్దతును ప్రకటించాయి.  

Latest Videos

మాస్టర్ ప్లాన్  ముసాయిదా మాత్రమేనని  జిల్లా కలెక్టర్  ప్రకటించారు.   దీంతో  ఆందోళనలు  వారం రోజులపాటు  వాయిదా వేశారు.  ఇవాళ మరోసారి  సమావేశమైన రైతు జేఏసీ ప్రతినిధులు  విలీన గ్రామాల  కౌన్సిలర్లను రాజీనామా చేయాలని  డిమాండ్ ను తెరమీదికి తీసుకువచ్చారు. 

విలీన గ్రామాల నుండి తొమ్మిది మంది కౌన్సిలర్లు  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ కౌన్సిలర్లు తమ పదవులకు  రాజీనామాలు సమర్పిస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ  రైతు జేఏసీ ప్రతినిధులు  తెలంగాణ హైకో్ర్టులో  పిటిషన్ ను  దాఖలు  చేశారు.  సంక్రాంతి తర్వాత  ఈ పిటిషన్ పై  హైకోర్టు విచారణను నిర్వహించనుంది.

also read:ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు వరకు పోరాటం: రైతుజేఏసీ నిర్ణయం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్  పై రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న తరుణంలో జగిత్యాలలో కూడా మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  రైతులు ఆందోళనలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం జగిత్యాల మున్సిపాలిటీ ఎదుట  మాస్టర్ ప్లాన్ పరిధిలోని  గ్రామాల రైతులు  ఆందోళన నిర్వహించారు.  మాస్టర ప్లాన్  ఫ్లెక్సీకి నిప్పు పెట్టారు.  

click me!