కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో భారీగా ఓట్లు గల్లంతు...గ్రామస్థుల నిరసన

By Arun Kumar PFirst Published Dec 7, 2018, 10:58 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిపసిందే. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని  రామారెడ్డి మండల కేంద్రంలో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో గ్రామస్థులు రోడ్డు పై బైటాయించి రాస్తా రోకో చేస్తున్నారు. గ్రామంలోని దాదాపు 50శాతం ఓట్లను తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. తమకు ఓటేసే అవకాశం కల్పించేవరకు నిరసనను విరమించబోమని గ్రామస్థులు చెబుతున్నారు. 

అలాగే  తెలంగాణలోని మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో చెదురు మదురుగా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రముఖులందరు కూడా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సినీచ క్రీడా ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిల్చుని మరి ఓటేస్తున్నారు. 

ఇవాళ ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 10 శాతం ఓట్లు పోలైనట్టుగా  ఎన్నికల సంఘం ప్రకటించింది.కొన్ని చోట్ల  చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. అలాగే మరికొన్ని చోట్ల గుత్తా జ్వాల వంటి సెలబ్రిటీల ఓట్లు గల్లంతయ్యాయి. ఇలా చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే అన్నిచోట్లా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 

click me!