మాకు అన్ని పార్టీలు సమానమే..నోడల్ అధికారి జితేందర్

Published : Dec 07, 2018, 10:51 AM IST
మాకు అన్ని పార్టీలు సమానమే..నోడల్ అధికారి జితేందర్

సారాంశం

ఏ పార్టీ పట్ల తాము పక్షపాతంగా వ్యహరించడం లేదన్నారు. అవనసరంగా తమపై మహాకూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

తమకు అన్ని పార్టీలు సమానమేనని.. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఏ పార్టీ పట్ల తాము పక్షపాతంగా వ్యహరించడం లేదన్నారు. అవనసరంగా తమపై మహాకూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రధాన అధకారి రజత్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , చిన్నరెడ్డి ఇళ్లల్లో సోదాలు చేసినట్లు కూటమినేతలు సీఈవో రజత్ కుమార్ కి ఫిర్యాదు చేశారని.. కానీ.. అసలు వారి ఇళ్లల్లో తనిఖీలు జరగలేదని ఆయన వివరణ ఇచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు సాయంత్రం 5గంటల వరకు  పోలింగ్ జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu