బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదికపై బిల్కిస్ బానో రేపిస్టు.. సమాజంగా మనం ఏమైపోయామన్న ఎమ్మెల్సీ కవిత..

Published : Mar 27, 2023, 10:57 AM IST
బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదికపై బిల్కిస్ బానో రేపిస్టు.. సమాజంగా మనం ఏమైపోయామన్న ఎమ్మెల్సీ కవిత..

సారాంశం

 బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు నుంచి విడుదలైన వారిలో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 11 మంది దోషులను గతేడాది జైలు నుంచి విడుదల చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ 11 మందిలో ఒకరు.. గుజరాత్‌లో జరిగిన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్‌గా మారాయి. అయితే ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. 

బిల్కిస్ బానో రేపిస్ట్ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకున్నారని కవిత పేర్కొన్నారు. ఒకవైపు బాధితురాలు న్యాయం చేయాలని వేడుకుంటుంటే.. మరోవైపు మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారిని సంబరాలు చేసుకుంటున్నారని.. సమాజంగా మనం ఏమైపోయామని కవిత ప్రశ్నించారు. భారతదేశం గమనిస్తోందని పేర్కొన్నారు. 

 


ఇదిలా ఉంటే.. గుజరాత్‌లోని దహోడ్ జిల్లా కర్మాడీ గ్రామంలో మార్చి 25న గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్‌కు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఎంపీ జస్వంత్ సిన్ భాభోర్, ఆయన సోదరుడు, లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్‌‌లు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషి శైలేశ్ చిమ్నాలాల్ భట్ హాజరుకావడం.. ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి ఫోటోలకు పోజులివ్వడంతోపాటు పూజల్లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక,  2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. బిల్కిస్‌ బానోపై  సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబంలోని ఏడుగురిని చంపినందుకు 2008లో వారికి జీవిత ఖైదు విధించబడింది. అయితే గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ ఘటనకు సంబంధించిన 11 మంది దోషులను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు