
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నమూనాను చిలుకానగర్ డివిజన్ కార్పోరేటర్ గోపు సరస్వతి ఏర్పాటు చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మంటపంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రతిబింబించే విధంగా ఆనకట్ట కింద వున్న రిజర్వాయర్లు, లిఫ్ట్‌లకు ఇందులో చోటు కల్పించారు.
ఈ వినాయక మంటపాన్ని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. అనంతరం బొంతు మాట్లాడుతూ.. ప్రజలకు, విద్యార్ధులకు ప్రాజెక్ట్‌పై అవగాహన పెంచే విధంగా ఈ నమూనా ఉందన్నారు.
అహోరాత్రులు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అందించారని ఆయన కొనియాడారు. ప్రాజెక్ట్‌లలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది.. అలాగే నీరు ఏ విధంగా చేరుతుందో ఈ నమూనాలో చక్కగా వివరించారని బొంతు ప్రశంసించారు. మేయర్ వెంట ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి, పలువురు కార్పోరేటర్లు ఉన్నారు.