తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ట్విస్ట్: ఆ ఇద్దరి నామినేషన్లు రిజెక్ట్

By narsimha lodeFirst Published Feb 1, 2020, 4:55 PM IST
Highlights

తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో రంగారెడ్డి నామినేషన్ సక్రమంగా ఉంది. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

హైదరాబాద్:  తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్  అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులకు షాక్ తగిలింది. ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీగా సాగుతాయని భావించారు. కానీ వీరిద్దరి నామినేషన్లు తిరస్కరించడంతో  రంగారావు ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలంగాణ ఒలంపిక్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్,  మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ చేయాలని నామినేషన్లు దాఖలు చేశారు.

తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌కు  టీఆర్ఎస్‌ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని  ప్రచారం సాగింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మద్దతు ఇవ్వనుందని ప్రచారం సాగింది.

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌‌కు క్యాట్ నుండి అనుమతి రాలేదు. దీంతో జయేష్ రంజన్  నామినేషన్ తిరస్కరించారు. మరో వైపు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి నామినేషన్‌‌ను తిరస్కరించారు. నామినేషన్ పత్రం సరిగా నింపనందుకు ఆయన నామినేషన్‌ను కూడ తిరస్కరించారు.

దీంతో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి  రంగారావు వేసిన నామినేషన్ సక్రమంగా ఉంది. రెండు నామినేషన్లు తిరస్కరణకు గురికావడం, ఒకే నామినేషన్ మిగలడంతో రంగారావును ఒలంపిక్ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం నెలకొంది.ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

click me!