బ్యాంకుకు రుణం ఎగవేత: జుపిటర్ బయోసైన్స్ సంస్థపై సీబీఐ కేసు

Published : Mar 31, 2022, 01:21 PM IST
బ్యాంకుకు రుణం ఎగవేత: జుపిటర్ బయోసైన్స్ సంస్థపై సీబీఐ కేసు

సారాంశం

జుపిటర్ బయో సైన్స్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు నుండి తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఐఎప్‌సీఐ బ్యాంకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. 

హైదరాబాద్: Jupiter Bioscience సంస్థపై CBI గురువారం నాడు కేసు నమోదు చేసింది. ఐఎఫ్‌సీఐ నుండి జుపిటర్ బయో సైన్స్ సంస్థ రుణం తీసుకొంది.ఈ రుణం తిరిగి చెల్లించలేదు. దీంతో ఐఎఫ్ సీఐ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు జుపిటర్ బయో సైన్స్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

2009-10 లో జుపిటర్ బయో సంస్థ IFCI నుండి రూ. 60 కోట్ల రుణం తీసుకొంది. అయితే 2011 నుండి ఈ రుణం చెల్లించలేదు  జుపిటర్ సంస్థ. దీంతో  కేసు నమోదైంది.

 రునాలు పొందేందుకు జుపిటర్ బయో సైన్స్ సంస్థ భూమి పత్రాలను తనఖా పెట్టింది.  బ్యాంకు రుణం కోసం తనఖా పెట్టిన భూమి పత్రాల్లో కూడా అవకతవకలున్న విషయాన్ని ఆలస్యంగా ఐఎప్‌సీఐ గుర్తించింది.  రుణం తిరిగి చెల్లించకపోవడంతో  ఆ సంస్థ చైర్మెన్ సహా ముగ్గురు డైరెక్టర్లపై ఐఎప్‌సీఐ ఫిర్యాదు చేసింది. దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది.

జుపిటర్ బయో సైన్స్ సంస్థపై  న్యూఢిల్లీకి చెందిన ఐఎఫ్‌సీఐ బ్యాంకు  డీజీఎం Hyderabad లోని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆదారంగా కేసు నమోదు చేశారు. తొలుత రూ. 40 కోట్లు ఆ తర్వాత వ్యాపార విస్తరణ కోసం రూ. 20 కోట్లు అప్పుగా తీసుకొన్నారని ఐఎప్‌సీఐ సంస్థ తెలిపింది.

బ్యాంకులో తాకట్టు పెట్టిన భూమి పత్రాల విలువ తప్పుడుగా పేర్కొందని కూడా బ్యాంకు అధికారులు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.హైద్రాబాద్ అంబర్ పేట, బెంగుళూరులో ఉన్న భూమి విలువను తప్పుడుగా చూపారని ఫిర్యాదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?