ఊరంతా పండుగ, ఆకుటుంబంలో విషాదం: జగిత్యాలలో దారుణం

Published : Oct 07, 2019, 10:39 AM ISTUpdated : Oct 07, 2019, 10:40 AM IST
ఊరంతా పండుగ, ఆకుటుంబంలో విషాదం: జగిత్యాలలో దారుణం

సారాంశం

వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. గుర్రం అజయ్ రెడ్డి, ముస్కు రాజిరెడ్డిలు పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 

జగిత్యాల: దేవీ శరన్నవత్రుల సందర్భంగా ఊరువాడ అంతా సంబంరంగా ఉంటే ఆ ఇంట్లో మాత్రం విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. పండుగపూట కుటంబ సభ్యులతో గడపాలని భావించిన రైతులు వేకువ జామునే పొలానికి వెళ్లిన వారు శాశ్వతంగా వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో రోదనలు అన్నీ ఇన్నీ కావు. 

వివరాల్లోకి వెళ్తే వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. గుర్రం అజయ్ రెడ్డి, ముస్కు రాజిరెడ్డిలు పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందర్నీ కలచి వేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విద్యుత్ షాక్ తోనే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో నిర్థారించారు.  

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!