కరోనా వైరస్ వ్యాధి సోకి హైదరాబాదులోని ఓ ప్రముఖ వజ్రాల వ్యాపారి మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆయన బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఘటనతో అతనికి కరోనా సోకింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో గల ఓ వజ్రాల వ్యాపారి కరోనా వైరస్ వ్యాధితో మృత్యువాత పడ్డాడు. ఆ వ్యాపారి జన్మదిన వేడుకలను జూన్ 22వ తేదీన కుటుంబ సభ్యులను ఘనంగా నిర్వహించారు. ఇద్దరు మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జువెలరీ అసోసియేషన్ కు చెందన ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 150 మంది ఈ విందులో పాల్గొన్నారు.
ఆ తర్వాత రెండు రోజులకు వజ్రాల వ్యాపారి దగ్గు, ఆయాసంతో బాధపడుతూ మాసబ్ ట్యాంకులోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. తాత్కాలికంగా మందులు రాసి, కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. మందులు వేసుకున్నా దగ్గు, ఆయాసం తగ్గలేదు. దాంతో ఆరు రోజుల క్రితం సికింద్రాబాదులోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చేరిన మర్నాడే మృత్యువు అతన్ని కబళించింది.
undefined
ఆ బర్త్ డే వేడుకలకు హాజరైన జువెలరీ అసోసియేషన్ ప్రతినిది కూడా కోరనా వైరస్ సోకి ఆరు రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో మరణించాడు. వేడుకలకు హాజరైన 20 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఓ ప్రముఖ రాజకీయ నేతకు కూడా పాజిటివ్ వచ్చింది. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జీ కూడా అయ్యారు.
హైదరాబాదులో ఇటువంటి సంఘటనలు అది వరకే జరిగాయి. వనస్థలిపురం ఏ క్వార్టర్ లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్ లో తన కూతురు జన్మదిన వేడుకలు చేశాడు. దానికి హాజరైన 28 మందికి కరోనా వైరస్ సోకింది. అదే కుటుంబంలోని తండ్రీకొడుకులు మరణించారుడ.
మలక్ పేటలో ఓ అపార్టుమెంటులో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీరు మే నెలలో తన కూతురు జన్మదిన వేడుకలు నిర్వహించారు. దానికి హాజరైన పిల్లల ద్వారా అదే అపార్టుమెంటులోని 52 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది.
పహాడీషరీఫ్ కు చెందిన మటన్ వ్యాపారి భార్య తరఫు బంధువులంతా మే మూడో వారంలో ఒక చోటు చేరారు. మూడు నాలుగు రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండి సామూహిక భోజనాలు చేశారు. ఆటపాటలతో గడిపారు. దాంతో 30 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.