రిసార్టులో ఎస్సై రాసలీలలు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబ్బంది

Arun Kumar P   | Asianet News
Published : Jun 04, 2021, 03:55 PM ISTUpdated : Jun 04, 2021, 04:03 PM IST
రిసార్టులో ఎస్సై రాసలీలలు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబ్బంది

సారాంశం

హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న అనిల్ హైదరాబాద్ శివారులోని సైలెంట్ వరల్డ్ రిసార్ట్ లో ఓ మహిళతో వుండగా పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

హైదరాబాద్: బాధ్యతాయుతమైన ఓ పోలీస్ అధికారి ఓ మహిళతో రాసలీలలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న అనిల్ హైదరాబాద్ శివారులోని సైలెంట్ వరల్డ్ రిసార్ట్ లో ఓ మహిళతో వుండగా పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సై  రాసలీలపై పక్కా సమాచారంతో రిసార్ట్ పై దాడిచేసిన పోలీసులు ఇద్దరినీ కీసర పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

ఇదిలావుంటే ఇటీవల దొంగ బాబాల చేతిలో అత్యాచారానికి గురయిన మహిళకు న్యాయం చేయాల్సింది పోయి పంచాయితీ చేసిన ఇద్దరు పోలీసులు సస్పెండయ్యారు. తనపై జరిగిన అత్యాచారంపై రామన్న పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితురాలు రాచకొండ సీపీని ఆశ్రయించింది. సీపీ విచారణలో పోలీసుల, బాబాల బాగోతం వెలుగుచూసింది. కేసులో నిర్లక్ష్యం వహించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు రావడంతో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ లను సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం మునిపంపులలో పూజల పేరుతో బురిడీ బాబాలు ఓ మహిళ మీద అత్యాచారానికి పాల్పడ్డారు. దంపతుల గొడవల్లో బురిడీ బాబాలు తలదూర్చారు. పూజల పేరుతో ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దాన్నంతా వీడియో తీశారు. 

ఆ తరువాత ఈ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా నగదు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీడియోలు డిలీట్ చేయించి బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు వాపస్ ఇప్పించారు. మిగతా డబ్బు ఇవ్వకపోవడంతో రాచకొండ సీపీని బాధితురాలు ఆశ్రయించింది. దీంతో సీఐ,ఎస్సై సస్పెండయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?