32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ: తెలంగాణలో పోటీపై తేల్చేసిన పవన్

By narsimha lode  |  First Published Oct 2, 2023, 10:09 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది.జీహెచ్ఎంసీ పరిధిలోని సీట్లతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోటీ చేయనున్నట్టుగా ఆ పార్టీ తెలిపింది.



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని  32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  ఈ నెలలోనే  ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు  ఈ ఎన్నికలకు సన్నద్దమౌతుంది. అయితే  ఈ దఫా  మాత్రం  పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది.

2018 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు.  నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే  తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు జరిగాయి. తమకు తగినంత సమయం లేని కారణంగానే  ఎన్నికల్లో పోటీ చేయలేదని  జనసేన ప్రకటించింది.గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత  జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించింది.ఈ మేరకు కొందరు అభ్యర్థులు కూడ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో  కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ కళ్యాణ్ తో చర్చించారు.  బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఉన్నందున  బీజేపీకి మద్దతుగా నిలవాలని  కోరారు. దీంతో  బీజేపీకి మద్దతిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. బీజేపీ, జనసేన మధ్య మితృత్వం ఉంది. అయితే  తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే విషయమై రెండు పార్టీల నుండి స్పష్టత రావాల్సి ఉంది.

Latest Videos

undefined

also read:టీడీపీ,జనసేన కలిసినా అమీతుమీ పోటీ: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని  పవన్ కళ్యాణ్ గత నెలలో  ప్రకటించారు. చంద్రబాబును జైల్లో కలిసి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు. బీజేపీతో పొత్తులో ఉండి కూడ పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.  వారాహి యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని నిన్న ఆవనిగడ్డలో  నిర్వహించిన సభలో కూడ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. 

జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఇవే

1.కూకట్‌పల్లి
2.ఎల్‌బీనగర్
3.నాగర్ కర్నూల్
4.వైరా
5.ఖమ్మం
6.మునుగోడు
7.కుత్బుల్లాపూర్
8.పటాన్ చెరు
9.శేరిలింగంపల్లి
10.సనత్ నగర్
11.ఉప్పల్
12.కొత్తగూడెం
13.ఆశ్వరావుపేట
14.పాలకుర్తి
15.నర్సంపేట
16.స్టేషన్‌ఘన్‌పూర్
17.హుస్నాబాద్
18.రామగుండం
19.జగిత్యాల
20.నకిరేకల్
21.హుజూర్ నగర్
22.మంథని
23.కోదాడ
24.సత్తుపల్లి
25.వరంగల్ వెస్ట్
26.వరంగల్ ఈస్ట్
27.మల్కాజిగిరి
28.ఖానాపూర్
29.మేడ్చల్
30.పాలేరు
31.ఇల్లెందు
32. మధిర
 

click me!