రాజీవ్ శర్మ కేసిఆర్ కు బ్రోకర్, మోడీతో కుమ్మక్కు: జైపాల్ రెడ్డి

By pratap reddyFirst Published Sep 12, 2018, 6:36 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఎస్. జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఎస్. జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనంత మేధావి లేరనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో కేసీఆర్‌కు రహస్య ఒప్పందం కుదిరిందని విమర్శించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్ ఇద్దరూ కుమ్మక్కై.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురుద్దేశంతో తనకు చెంచాగిరి చేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. 

రాజీవ్ శర్మ కేసీఆర్‌కు బ్రోకర్‌గా పనిచేస్తున్నారని అన్నారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. కేవలం డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. 


టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, జైపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల సమక్షంలో జడ్చర్లకు చెందిన పారిశ్రామికవేత్త అనిరుద్ రెడ్డి బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడారు. 

కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వనీయత ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

click me!