జగిత్యాల మాస్టర్ ప్లాన్: రోడ్లను అష్ట దిగ్భంధనం చేసిన రైతులు

By narsimha lodeFirst Published Jan 19, 2023, 1:04 PM IST
Highlights

 జగిత్యాల  మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ  రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ  పలు రోడ్లపై రైతులు బైఠాయించి  ఆందోళనకు దిగారు.  

జగిత్యాల: జగిత్యాల  మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ   బాధిత గ్రామాల రైతులు రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగారు. మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  గురువారం నాడు  రైతు జేఏసీ  జగిత్యాల  అష్టదిగ్భంధనానికి పిలుపునిచ్చింది.   జగిత్యాల -నిజామాబాద్  రహదారిపై అంబారీ పెట్, హుస్నాబాద్ గ్రామస్తుల రాస్తారోకో  నిర్వహించారు.జగిత్యాల -పెద్దపల్లి రహదారిపై తిమ్మాపూర్, మోతె గ్రామస్తుల ధర్నాకు దిగారు.జగిత్యాల- ధర్మపురి రహదారిపై తిప్పన్నపేట గ్రామస్తుల, జగిత్యాల- కరీంనగర్ రహదారిపై ధరూర్ , నర్సింగపూర్ గ్రామస్తులు బైఠాయించారు.

జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను  వెనక్కి తీసుకొనే వరకు ఆందోళనను  కొనసాగిస్తామని  రైతులు ప్రకటించారు.  ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు గాను  ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో   నిరసనకు రైతు జేఏసీ  ఆధ్వర్యంలో   నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ   విలీన గ్రామాల రైతులు  మూకుమ్మడిగా  ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.  ఈ నెల  17న జగిత్యాల కలెక్టరేట్  ముందు  రైతులు  ఆందోళన నిర్వహించారు.  ఈ ఆందోళన  ఉద్రిక్తంగా మారింది.అదే రోజున అంబారీపేట గ్రామపంచాయితీ  భవనం ఎక్కి మహిళా రైతులు  నిరసనకు దిగారు. మాస్టర్ ప్లాన్  ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్  చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే  సంజయ్ కుమార్  నివాసాన్ని మహిళా రైతులు కూడా ముట్టడించారు.  అయితే  ఒక్క ఎకరం భూమిని కూడా   కోల్పోకుండా  చూస్తామని  ఎమ్మెల్యే  రైతులకు హామీ ఇచ్చారు. అయితే  తమకు ఈ విషయమై   రాతపూర్వకంగా  ఇవ్వాలని కూడా  రైతు నేతలు డిమాండ్  చేస్తున్నారు.  అంతకుముందు  జగిత్యాల  మున్సిపల్ కార్యాలయం ముందు  రైతులు ఆందోళననిర్వహించారు.  రోడ్లపై బైఠాయించి  ఆందోళన చేశారు.
 

click me!