మైహోమ్స్ రామేశ్వరావు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

Siva Kodati |  
Published : Jul 04, 2019, 06:34 PM ISTUpdated : Jul 04, 2019, 09:12 PM IST
మైహోమ్స్ రామేశ్వరావు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

సారాంశం

మైహోమ్స్ సంస్థతో పాటు టీవీ9 ఛానెల్‌పై ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. హైటెక్ సిటీలో ఉన్న మైహోమ్స్ కార్యాలయంతో పాటు సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరావు నివాసంపై దాదాపు 200 మంది అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు సోదాలు నిర్వహించారు.

మైహోమ్స్ సంస్థతో పాటు టీవీ9 ఛానెల్‌పై ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. హైటెక్ సిటీలో ఉన్న మైహోమ్స్ కార్యాలయంతో పాటు సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరావు నివాసంపై దాదాపు 200 మంది అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో పలు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. 

రామేశ్వర రావు కంపెనీలకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా సజావుగానే ఉన్నాయని భావిస్తున్నారు. అయితే, నగదు లావాదేవీలు, మనీలాండరింగ్ వంటివి ఏమైనా జరిగాయా  అనే కోణంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీవీ9 న్యూస్ చానెల్ కొనుగోలు వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్