ఎంపీ సంతోష్ కుమార్ హర్ట్ అయ్యారా?.. ఫోన్ స్విచ్ఛాఫ్‌తో టీఆర్ఎస్‌ వర్గాల్లో కలవరం..!

By Sumanth KanukulaFirst Published Sep 28, 2022, 2:42 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీలో జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ అంటే తెలియని వారుండరు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సంతోష్ కుమార్.. ఆయన వ్యక్తిగత  వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత నుంచి పార్టీ వ్యవహారాల్లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. 

టీఆర్ఎస్ పార్టీలో జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సంతోష్ కుమార్.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు భార్య తరఫు బంధువనే సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సంతోష్ కుమార్.. ఆయన వ్యక్తిగత  వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు సంతోష్ ఎక్కడున్నారనేది మిస్టరీగా మారిందని.. కొన్ని రోజుల నుంచి ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పుకార్లు వేగంగా వ్యాప్తిలోకి వచ్చినట్టుగా డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ చేసింది. ఆ కథనం ప్రకారం.. ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌కు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉన్నట్టుగా బీజేపీ ఆరోపణలు చేసింది. 

ఆ తర్వాత ఈడీ అధికారులు.. సంతోష్‌తో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావును విచారించారు. వెన్నమనేనితో కలిసి సంతోష్ పలు వ్యాపారాలు చేస్తున్నారు. వెన్నమనేనిపై ఈడీ విచారణ కొనసాగుతుండగా పలు అసహ్యకరమైన విషయాలు వెలుగులోకి రావడంతో.. సంతోష్ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి చర్చించినట్లు తెలుస్తోంది. అత్యంత గోప్యంగా సాగిన చర్చ.. సంతోష్‌ను కేసీఆర్ మందలించడానికి దారితీసిందని తెలుస్తోంది.  ఆ తర్వాత సంతోష్.. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అంతేకాకుండా కేసీఆర్ వద్ద వ్యక్తిగత వ్యవహారాలు చూసేందుకు హాజరు కాలేదు. 

అయితే పార్టీలో ఇందుకు సంబంధించిన ప్రచారం జరగడంతో.. టీఆర్ఎస్ పుకార్లను అణిచివేసేందుకు ప్రయత్నించింది. ఏదో ఒక చిన్న విషయంపై తిట్టడం వల్ల సంతోష్ మానసికంగా కలత చెందారని పేర్కొంది. సాధారణంగా పార్టీ విషయాల్లో యాక్టివ్‌గా ఉండే సంతోష్.. ఎప్పుడూ లేని విధంగా  అసంతృప్తిగా ఉండటం పెద్ద సమస్యగా మారింది. రోజులు గడస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదని.. కనీసం మూడు రోజులుగా సంతోష్ తన విధులకు, పార్టీకి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

అయితే ఎలాంటి  ప్రతిస్పందన కోసం సంతోష్‌ను చేరుకోలేకపోయాం. అయితే పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలలో  కీలకమైన వ్యక్తిగా ఉన్న సంతోష్.. ఇప్పుడు ఎక్కడున్నారనే స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పార్టీ నాయకులు కలవరపడుతున్నారు. మరోవైపు సంతోష్ ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరనే వార్తలను ఓ టీఆర్ఎస్ నాయకుడు ఖండించాడు. “సంతోష్ గారు హైదరాబాద్‌లో చాలా ఉన్నారు. బహుశా అతను కొంచెం అసంతృప్తిగా ఉండవచ్చు. అతను త్వరలో తిరిగి వస్తారు” అని పేర్కొన్నారు. 

click me!