Nalgonda: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఒంటరిగా ఉన్న పదో తరగతి బాలికపై ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలుపడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లగొండ చోటుచేసుకున్న ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లాలోని ఓ కుగ్రామంలో 16 ఏళ్ల బాలికపై 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు భరోసా కేంద్రానికి పంపించారు. నల్లగొండ జిల్లా పెదవూర మండలంలోని ఓ కుగ్రామానికి చెందిన 16 ఏళ్ల గిరిజన విద్యార్థి.. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. నిందితుడు పక్క ఊరికి చెందిన యువకుడు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని బాలిక ఇంటికి వెళ్లాడు.
ఈ క్రమంలోనే బాలికపై దారుణానికి ఒడికట్డారు. బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగులో నివసిస్తున్న వారు అక్కడికి చేరుకున్నారు. వారు బాలికతో పాటు నిందితుడిని చూసి కేకలు వేయడంతో వెంటనే యువకుడు, అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక కుటుంబసభ్యులు పెదవూర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లడానికి పోలీసులు నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.