మాది తోటికోడళ్ల పంచాయితీ: రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ

By narsimha lodeFirst Published Dec 2, 2022, 4:43 PM IST
Highlights


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య ఇవాళ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.తమది తోటికోడళ్ల మధ్య పంచాయితీ మాత్రమేనని   రేవంత్ రెడ్డి  చెప్పారు.

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య శుక్రవారంనాడు ఆసక్తికర సంభాషణ చోటు  చేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో  రేవంత్  రెడ్డి, జగ్గారెడ్డి ఎదురు పడ్డారు.దీంతో  ఇరువురు  నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.దీంతో అక్కడే ఉన్న  మీడియా కెమెరామెన్లు  ఈ ఇద్దరు నేతల హవభావాలను  చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులు కూడ ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకొంటారో  అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు నేతలు నవ్వుతూ  మీడియా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తమ  మధ్య  తోటికోడళ్ల మధ్య  పంచాయితీ మాత్రమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు.

తాను రేవంత్ రెడ్డి  గురించి చెప్పాలనుకున్నది చెప్పేశానని  జగ్గారెడ్డి  తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్  రెడ్డి గురించి మాట్లాడబోనన్నారు.  ముందు ఒకటి, వెనుక ఒకటి తాను మాట్లాడబోనని  జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. తాము అనుకుంటాం, ఆ తర్వాత కలిసుంటామని  జగ్గారెడ్డి  చెప్పారు. కానీ  వీరిద్దరూ ఎందుకు కలిసున్నారనే భావనలో  మీడియా ప్రతినిధులున్నారని జగ్గారెడ్డి నవ్వుతూ వ్యాఖ్యానించారు. 

తోటికోడళ్లు అనుకుంటారు, ఆ తర్వాత కలిసుంటారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు. తోటి కోడళ్ల మాదిరిగానే తాముంటామని రేవంత్ రెడ్డి నవ్వుతూ చెప్పారు.అయితే మీలో  పెద్ద కోడలు ఎవరని  ఓ  మీడియా ప్రతినిధి ప్రశ్నించగా మనం  ఇప్పుడే కలిశామో  లేదో  అప్పుడే మన మధ్య గ్యాప్  పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియా ప్రతినిధులనుద్దేశించి రేవంత్ రెడ్డి నవ్వుతూ  వ్యాఖ్యానించారు. మీరు చెప్పినదానికే తాము అడుగుతున్నామని  మీడియా ప్రతినిధి నవ్వుతూ  చెప్పారు. దీంతో అక్కడ ఉన్నవారంతా నవ్వారు.

గతంలో  కూడా  రెండు దఫాలు జగ్గారెడ్డి , రేవంత్ రెడ్డిలు  ఇలా కలుస్తూ  మీడియాకు ఫోజులు ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో  జగ్గారెడ్డి ,రేవంత్ రెడ్డిలు  సమావేశమయ్యారు. మీడియాకు ఫోజులిచ్చారు. సీఎల్పీలోని రూమ్ లో  సమావేశమయ్యారు. ఆ తర్వాత  ఇటీవల గాంధీభవన్ లో  రేవంత్ రెడ్డి,  జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సమయంలో జగ్గారెడ్డితో  రేవంత్ రెడ్డి కొద్దిసేపు మాట్లాడారు.ఈ సమయంలో రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి మీసం దువ్వారు. 

click me!