కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం.. బీజేపీ సిగ్నల్స్, బీఎల్ సంతోష్‌ని కాపాడాలనే : జగ్గారెడ్డి సంచలనం

By Siva KodatiFirst Published Dec 2, 2022, 4:03 PM IST
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని, ఈ మేరకు బీజేపీ సిగ్నల్స్ ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. బీఎల్ సంతోష్‌ను ఎలా కాపాడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజులుగా లిక్కర్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయన్నారు. రెండు స్కాంలు కూడా నిజమని తేలిందని.. కవిత లిక్కర్ కేసులో వుందని, అరెస్ట్ చేస్తామని బీజేపీ ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్ ఇచ్చేసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. కవిత, బీఎల్ సంతోష్ ఇద్దరూ నేరగాళ్లేననని.. కవితను, బీఎల్ సంతోష్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బీఎల్ సంతోష్‌ను ఎలా కాపాడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీఎల్ సంతోష్‌ను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 

ALso Read:ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు: డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరు?.. సిట్ అధికారి గంగాధర్‌పై ఏసీబీ కోర్టు సీరియస్

అంతకుముందు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు డిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్ లో నమోదయ్యిందన్నారు. ఇలాంటిది టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో కొనసాగే హక్కు లేదని ప్రభాకర్ పేర్కొన్నారు. ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. కానీ ఆమె నిస్సిగ్గగా మాట్లాడుతున్నారని... బాధ్యతారాహిత్యంగా బయటకు వచ్చి ఏం చేస్తారు... అరెస్ట్ చేస్తే చేసుకోని అంటూ మాట్లాడటం దారుణమన్నారు. 

సిగ్గు లేకుండా అరెస్ట్ చేస్తే చేసుకోండి అన్నారంటే ఎంతకు దిగజారారో అర్థమవుతుందని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. కవిత పేరు లిక్కర్ స్కాం లో బయటపడగానే నైతిక బాధ్యతగా ప్రభుత్వం స్పందించాల్సిందని అన్నారు. 'నేను కొట్టినట్లు నువ్వ ఏడ్చినట్లు వుండాలి' అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని పొన్నం పేర్కొన్నారు. టీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోవడమే కాదు ఆప్ ను కూడా ఈ అవినీతి కూపంలోకి లాగిందని ఆయన ఎద్దేవా చేశారు. భూములు, ఇసుక, గనుల పేరుమీదే కాదు వీస్కీల పేరుమీద సంపాదిస్తున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 
 

click me!