ఇక్కడ దొంగిలిస్తారు.. ఢిల్లీలో అమ్ముతారు.. మూడేళ్లలో 6884 వాహనాలు సరిహద్దులు దాటించారు..

Published : Feb 14, 2022, 09:54 AM IST
ఇక్కడ దొంగిలిస్తారు.. ఢిల్లీలో అమ్ముతారు.. మూడేళ్లలో 6884 వాహనాలు సరిహద్దులు దాటించారు..

సారాంశం

అదను చూసి ఖరీదైన కార్లను దొంగిలిస్తూ.. చాకచక్యంగా సరిహద్దులు దాటిస్తున్న ఓ ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేళ్లలో ఏకంగా వీరు 6884 కార్లు దొంగిలించడం ఆశ్చర్యం కలిగించే విషయం... 

హైదరాబాద్ :  లక్షలు కుమ్మరించి కొన్న vehiclesను రెప్పపాటులో కొట్టేస్తున్నారు thiefs. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సునాయాసంగా Boundaries దాటిస్తున్నారు. తక్కువ ధరకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాదులో 2019-21 మధ్య 6884 వాహనాలు చోరికి గురికాగా వాటిలో 1200-1500 వరకూ ఖరీదైన కార్లే ఉన్నాయి. ఇటీవల రాచకొండ పోలీసులు ఆలయాల్లో చోరీ చేస్తున్న gangను అరెస్టు చేసినపుడు ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది.

వీరు చోరీలు ప్రారంభించే ముందు Expensive carను అపహరిస్తారు. అదే కంపెనీ, రంగు ఉన్న కారు నెంబరు చోరీ చేసిన వాహనానికి అమర్చుతారు. అవసరం తీరాక తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఒక్కో చోరీకి ఒక్కో లెక్క ఉంది..
నగరానికి చెందిన చమన్ సతీష్ ముఠా నకిలీ ఆధార్ కార్డులు,  రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో చోరీ చేసిన వాహనాలకు దర్జాగా యాజమాన్య మార్పిడి చేయించారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆర్ సి లను  రవాణా శాఖ  యజమానులు ఇంటికి పోస్టల్/ కొరియర్ ద్వారా పంపుతుంది. కొన్ని చిరునామాలు సరిగా లేక  తిరిగి  కార్యాలయాలకు చేరుతుంటాయి. ఆ శాఖలోని ఇంటి దొంగల సాయంతో వాటిని సేకరించి వేలంలో కొన్న/కొట్టేసిన వాహనాలకు అనుకూలంగా  మార్చేవారు.

మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ పఠాన్ క్యాబ్ డ్రైవర్ గా కాప్రాలో మకాం వేశాడు. ముఠాను తయారుచేసి అర్ధరాత్రి దాటాక  ఖరీదైన కార్ల అద్దాలు తొలగించి తాళాలు సేకరించేవారు. అరగంటలో నకిలీ తాళం తయారు చేసి తీసుకెళ్లేవారు. అయిదేళ్ల వ్యవధిలో వందకుపైగా కార్లను చోరీ చేశాడు. కృష్ణా జిల్లా మహేష్  నూతన కుమార్..  కార్లను అద్దెకిచ్చే యాప్ లనే బురిడీ కొట్టించి 20కి పైగా ఎత్తుకెళ్లి అమ్మాడు. రాజస్థాన్ కు చెందిన కరడు గట్టిన కార్ల దొంగ సత్యేంద్ర సింగ్ షెకావత్ హ్యాండ్ బేబీ యాప్ ద్వారా ఖరీదైన కార్ల తాళాలను క్లోనింగ్ చేసి 90 కార్లు చోరీ చేసి అమ్మేశాడు.

ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు..
తెలుగు రాష్ట్రాల్లో కొట్టేసిన వాహనాలకు నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చి సరిహద్దులు దాటిస్తారు. ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు నగరాలకు చేర్చుతారు. అక్కడ నకిలీ పత్రాలు తయారు చేసి  చాలామంది మెకానిక్ లు, డ్రైవర్లకు  కమిషన్  ఆశ చూపి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ దొంగిలించిన అధిక శాతం కార్లను ఢిల్లీలో విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
 
ఇలాంటి వాహనాలను విక్రయించేందుకు శంషాబాద్, అత్తాపూర్, అబిడ్స్, నారాయణగూడ, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ దళారులు ఉన్నారు. వీరి ద్వారానే నకిలీ పత్రాలు సృష్టించి వాహనాలను సెకండ్హ్యాండ్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొట్టేసిన వాహనాలు ఇక్కడ, ఇక్కడ చోరీ చేసినవి ఇతర రాష్ట్రాల్లో చేర్చి విక్రయిస్తుంటారు.

పోలీసుల సూచనలు ఇవి…
ద్విచక్ర వాహనాలకు వీల్ లాక్ ఉపయోగించాలి. ఏడాదికోసారి  తాళం మార్చాలి. అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వకూడదు. స్టీరింగ్, క్లచ్,  బ్రేక్ లాక్ వంటి సురక్షిత పరికరాలు వాడాలి. బూట్ సహాయంతో కారు డోర్ లను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాలి. కిటికీలు పైకి లేపిన తర్వాతనే లాక్ చేసి.. పార్క్ చేయాలి. పార్కింగ్ కు కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలపాలి.  వాహన తాళాలను సురక్షితంగా ఉంచాలి. దొంగలు వాటిని గుర్తించి తయారు చేసే అవకాశం ఉంది. కారులో లౌడ్ అలారం సిస్టం ఏర్పాటు చేయాలి.  వాహనాలకు  బీమా చేస్తుండాలి. గడువు ముగియకముందే వాయిదా చెల్లించాలి. వాహనాలను రద్దీగా లేదా వెలుతురు ఉన్న ప్రాంతాల్లో నిలపాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu