నవ్యకు జీరో మార్కులు వేసిన ఇద్దరిపై వేటు

By telugu teamFirst Published Apr 29, 2019, 8:43 AM IST
Highlights

బబ్లింగ్ అవడానికి కారణం అయిన ఇద్దరిపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఎగ్జామినర్‌ ఉమాదేవికి అయిదువేలు జరిమానావేసింది. అంతే కాకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది, లెక్చరర్‌ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. 

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాలలో అవకతవకలపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై వేటు వేసింది. మంచిర్యాలకు చెందిన నవ్య అనే విద్యార్థినికి తెలుగులో 99 మార్కులకు బదులుగా సున్నా మార్కులు వచ్చాయి. 

అలా బబ్లింగ్ అవడానికి కారణం అయిన ఇద్దరిపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఎగ్జామినర్‌ ఉమాదేవికి అయిదువేలు జరిమానావేసింది. అంతే కాకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది, లెక్చరర్‌ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. 

ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ఫలితాలలో చోటు చేసుకున్న తప్పుల కారణంగా దాదాపు 20మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ విషయం తెలిసిందే.

click me!