ఇంటర్ ఫలితాల్లో మరో కోణం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బాగా చదివి పరీక్ష రాసాం అనుకున్న విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు.
ఇంటర్ ఫలితాల్లో మరో కోణం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బాగా చదివి పరీక్ష రాసాం అనుకున్న విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు. దీంతో.. ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికే 17మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
తాజాగా మరో సంఘటన బయటకు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాత్విక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంఈసీ పరీక్షలు రాశాడు. అతనికి గణితం 1(ఎ)లో 17 మార్కులు వచ్చాయి. వాస్తవానికి 27 మార్కులు వస్తేనే ఉత్తీర్ణత లభిస్తుంది. కానీ ఇంటర్‌బోర్డు మాత్రం పాసయినట్టు ఫలితమిచ్చింది. దీంతో.. అతని రిజల్ట్స్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. సాత్విక్.. కొత్తగూడెంలోని ఓ కళాశాలలో చదువుతున్నాడు.