భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడి ఇంటిపై ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సోదరులతో పాటు బంధువుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుండి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోని పలువురి ఇళ్లలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తోంది.మొత్తం 100 ఐటీ బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం.
హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోని పలువురి ఇళ్లు, కంపనీల్లో ఏకకాలంలో ఐటీ అధికారుల బృందాలు సోదాలు ప్రారంభించాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ సోదరుడికి చెందిన కూకట్ పల్లి ఇంటిలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వర రావు, రఘువీర్ మరియు వజ్రనాథ్ నివాసాలతో పాటు కంపనీల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెెలియాల్సి వుంది.