వివాహేతర బంధాన్ని కలిగిన యువకున్నే... అతి కిరాతకంగా హతమార్చిన వివాహిత

Arun Kumar P   | Asianet News
Published : Aug 17, 2021, 01:26 PM ISTUpdated : Aug 17, 2021, 01:30 PM IST
వివాహేతర బంధాన్ని కలిగిన యువకున్నే... అతి కిరాతకంగా హతమార్చిన వివాహిత

సారాంశం

వివాహేతర సంబంధాన్ని కలిగిన యువకున్నే భర్తతో కలిసి ఓ మహిళ అతి కిరాతకంగా హతమార్చిన దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: క్షణికానందం కోసం వివాహితతో అక్రమ సంబంధాన్ని సాగించిన ఓ యువకుడు చివరకు అదే మహిళ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇలా అక్రమ సంబంధం యువకుడి ప్రాణాలను బలితీసుకున్న దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నాచారంలోని మల్లాపూర్ లో నేహ-మొయినుద్దిన్ దంపతులు నివసించేవారు. భర్త పనుల్లో బిజీగా వుంటూ ఎక్కువసమయం బయటే గడుపుతుండటంతో నేహ ఇంట్లో ఒంటరిగా వుండేది. ఈ క్రమంలోనే ఆమెకు సోహెల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.  

భర్త మొయినుద్దిన్ ఇంటి నుండి బయటకు వెళ్లగానే ప్రియున్ని ఇంటికి పిలిపించుకునేది నేహ. ఇలాగే సోమవారం రాత్రి కూడా భర్త ఇంట్లోలేని సమయంలో ప్రియున్ని పిలుచుకుంది. వీరిద్దరు ఏకాంతంగా గడుపుతుండగా బయటకు వెళ్లిన భర్త తిరిగివచ్చాడు. ఇంట్లో మరో యువకుడితో భార్యను చూసిన మొయినుద్దిన్ కోపోద్రిక్తుడయ్యాడు. 

read more  మైనర్ కవలలపై అత్యాచారం.. కన్న తల్లి, మరో నలుగురికి జీవితఖైదు.. !

ఇదేంటని భార్యను మొయినుద్దిన్ నిలదీయగా అతడెవరో తనకు తెలియదని... బలవంతంగా ఇంట్లోకి వచ్చి ఒంటరిగా వున్న తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఆమె మాటలను నమ్మిన భర్త యువకుడిని బంధించాడు. భార్యాభర్తలిద్దరు కలిసి సోహెల్ ను హత్యచేసి నాచారం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. 

భార్యాభర్తలు తెలిపిన వివరాలతో హత్య జరిగిన ఇంటికి చేరుకున్న పోలీసులు సోహైల్ బాడీని స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?