ఈటలకు బిగ్ షాక్... ఇల్లందకుంట ఎంపిపి, ముగ్గురు సర్పంచ్ లు టీఆర్ఎస్ గూటికి

By Arun Kumar PFirst Published Jul 21, 2021, 12:36 PM IST
Highlights

మాజీ మంత్రి, బిజెెపి నాయకులు ఈటల రాజేందర్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ నియోజకర్గ పరిధిలోని ఓ మండల ఎంపిపి, ముగ్గురు సర్పంచ్ లు బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 

కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ కు ఇల్లందకుంట ఎంపిపి సరిగొమ్ముల పావని వెంకటేశ్ షాకిచ్చారు. బిజెపికి రాజీనామా చేసిన ఆమె మంగళవారం ఇల్లందకుంట మండల టీఆర్ఎస్ ఇంచార్జి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. 

ఇల్లందకుంట ఎంపిపితో పాటు మరికొందరు నాయకులు కూడా గులాబీ పార్టీలో చేరారు. ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య కూడా టీఆర్ఎస్ లో చేరారు. మండలంలోని సిరిసేడు, రాచపల్లిఖాన్, మర్రివానిపల్లి గ్రామాల సర్పంచులె ఎండీ రఫీక్, ఆదిలక్ష్మి, రాజిరెడ్డి కూడా బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరారు. వీరికి కూడా గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఎమ్మెల్యే రవిశంకర్. 

read more  ప్రవీణ్ కుమార్ వీఆర్‌ఎస్‌కు తెలంగాణ సర్కార్ ఆమోదముద్ర.. విధుల నుంచి రిలీవ్

ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దళిత సాదికారత కోసం దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నుండి ప్రారంభించడం ఎంతో  గొప్పవిషయమన్నారు. ఈ పథకమే తనను టీఆర్ఎస్ పార్టీలో చేరేలా చేసిందన్నారు. ఇలాంటి అనేక పథకాలతో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆనందంగా వుందన్నారు ఎంపిపి పావని వెంకటేశ్. 

మంత్రిమండలి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఈటల బిజెపిలో చేరడంతో బిజెపి-టీఆర్ఎస్ పార్టీల మధ్య జంపింగ్ లు మొదలయ్యాయి. కొందరు ఈటల వెంటే బిజెపిలో చేరగా... మిగిలినవారు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు.  

 
 

click me!