పిల్లల క్రికెట్ గొడవే కాల్పులకు కారణం: ఆదిలాబాద్ ఐజీ స్పందన

Siva Kodati |  
Published : Dec 18, 2020, 08:11 PM IST
పిల్లల క్రికెట్ గొడవే కాల్పులకు కారణం: ఆదిలాబాద్ ఐజీ స్పందన

సారాంశం

ఆదిలాబాద్ కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఐజీ నాగిరెడ్డి. కాల్పులకు పాల్పడిన ఫారూఖ్ అహ్మద్‌ను విచారిస్తున్నామని ఆయన  స్పష్టం చేశారు. క్రికెట్ గేమ్‌లో పిల్లల గొడవ సమయంలో కాల్పులు జరిపినట్లు ఆయన ఐజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ఆదిలాబాద్ కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఐజీ నాగిరెడ్డి. కాల్పులకు పాల్పడిన ఫారూఖ్ అహ్మద్‌ను విచారిస్తున్నామని ఆయన  స్పష్టం చేశారు. క్రికెట్ గేమ్‌లో పిల్లల గొడవ సమయంలో కాల్పులు జరిపినట్లు ఆయన ఐజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని నాగిరెడ్డి వెల్లడించారు. ఫారూఖ్ అహ్మద్ లైసెన్స్ గన్‌తో కాల్పులు జరిపాడని ఐజీ పేర్కొన్నారు. కాగా, తాటిగూడలో పాతకక్షలతో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్‌ అహ్మద్‌ ఇద్దరిపై కాల్పులు జరపడంతో పాటు మరొకరిపై తల్వార్‌తో దాడి చేశాడు.

కాల్పుల ఘటనలో జమీర్‌, మోతేషాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. తల్వార్‌తో జరిపిన దాడిలో మన్నన్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌
Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం