ఇప్పుడేమీ మాట్లాడను: హత్య కుట్ర కేసుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

Published : Mar 07, 2022, 06:20 PM IST
ఇప్పుడేమీ మాట్లాడను:  హత్య కుట్ర కేసుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

సారాంశం

తన హత్య కుట్ర విషయమై ఇప్పుడేమీ మాట్లాడబోనని తెలంగాణ రాష్ట్ర  ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సోమవారం నాడు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్: తన హత్యకు కుట్రపై తాను ఇప్పుడేమీ మాట్లాడబోనని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి V. Srinvas Goud చెప్పారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో  ఎనిమిది మందిని గత వారంలో  Cyberabad  పోలీసులు Arrest  చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. హత్య కుట్ర విషయమై స్పందించాలని మంత్రిని మీడియా ప్రతినిధులు కోరారు.

అయితే ఈ విషయ,మై తాను స్పందించబోనని చెప్పారు.ఈ విషయం Courtలో ఉన్నందున ఈ విషయమై తాను ఏమీ మాట్లాడికూడదన్నారు. ఈ విషయమై కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను స్పందిస్తానని మంత్రి వివరించారు. తెలంగాణ పోలీసులకు మంచి పేరున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎంతటి కేసునైనా Telangana Police చేధిస్తారన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.  మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు రూ. 15 కోట్లు సుఫారీ ఇచ్చారని  పోలీసులు తెలిపారు. ఈ విషయ,మై సైబరాబాద్ సీపీ Stephen Ravindra గత వారంలో మీడియాకు వివరించారు. ఈ కేసులో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల ప్రమేయం ఆరా తీస్తున్నట్టుగా వెల్లడించారు. 

Farooq, హైదర్ అలీ ఫిబ్రవరి 23న మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ కు వచ్చారు.  పేట్‌బషీరాబాద్‌ పరిధిలో సుచిత్ర వద్ద ఓ లాడ్జిలో వారు దిగారు. 25న మధ్యాహ్నం రెండింటికి ఆ ఇద్దరు సుచిత్ర సెంటర్‌కు వచ్చారు. అదే సమయంలో మహబూబ్‌నగర్‌‌ జిల్లాకు చెందిన నాగరాజు, బండేకర్ విశ్వనాథ్ రావు, వర్ణ యాదయ్యలు కత్తులు, ఇతర మారణాయుధాలతో ఫరూక్‌, హైదరాలీని చంపడానికి వెంటపడ్డారు.

 ఇది గమనించిన ఇద్దరు వారి నుంచి తప్పించుకొని పరారయ్యారని పోలీసులు తెలిపారు. అదేరోజు సాయంత్రం 5గంటలకు ఆ ఇద్దరూ ఘటనపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మరుసటి  రోజే నాగరాజు సహా ఇతర నిందితులను అదుపులోకి తీసుకున్నారని స్టీఫెన్ రవీంంద్ర తెలిపారు. 

గత నెల 26న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ముగ్గురిని విచారించగా యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ పేర్లు బయటకొచ్చాయి. రాఘవేందర్ రాజు  సహా మరికొందరు హత్యకు కుట్ర చేశారని నాగరాజు చెప్పాడు.నాగరాజు అరెస్టు విషయం తెలియగానే రాఘవేంద్రరాజు సహా ముగ్గురు నిందితులు మహబూబ్‌నగర్‌‌ నుంచి వైజాగ్‌ అక్కడి నుంచి ఢిల్లీకి పారిపోయారని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించిన పోలీసులు  నిందితులు డిల్లీలోనే ఉన్నట్లు గుర్తించారు. నిందితులకు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ ఆయన పీఏ రాజు ఆశ్రయం ఇచ్చినట్టుగా కనుగొన్నామని సీపీ తెలిపారు. 

దీంతో పోలీసుల బృందం Delhiకివెళ్లి వారిని గుర్తించి అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చామన్నారు. నిందితుల నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లు  స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్రరాజు, మున్నార్‌ రవి, మధుసూదన్‌ రాజు, అమరేందర్‌రాజును పోలీసులు విచారించగా వారంతా కలిసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్రపన్నినట్లు వెల్లడించారు. ఈ కేసులో మాజీ ఎంపీ జితేందర్‌‌రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుపుతామన్నారు. మంత్రిని ఎక్కడ, ఎలా కుట్ర చేయాలని చూశారనే వివరాలను విచారణలో రాబడతామని  స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!