అసంతృప్తి లేదు, అలా అయితే బిల్యా నాయక్ చేరిక కూడా చెల్లదు: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 10, 2022, 2:47 PM IST


పార్టీలో చురుకుగా ఉన్నానని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.పార్టీ కోసం పనిచేసేవారికే టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయమై పార్టీ అధిష్టానాన్ని కోరినట్టుగా చెప్పారు.


హైదరాబాద్: పార్టీలో చురుకుగానే ఉన్నానని ఎలాంటి అసంతృప్తితో లేనని భువనగరి ఎంపీ Komatireddy Venkat Reddy ప్రకటించారు. ఆదివారం నాడు తన నివాసం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదటి నుండి పార్టీలో ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. Congress పార్టీని బలోపేతం చేసినవారికే టికెట్లు ఇవ్వాలన్నారు. తాను ఇదే విషయాన్ని అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా చెప్పారు.

పీఏసీ సమావేశాలకు  తాను రాలేనని ఇదివరకే చెప్పినట్టుగా ఆయన గుర్తు చేశారు. 29 మందితో PAC  ఏర్పాటు చేస్తే ఏం ప్రయోజనమన్నారు. ఇంత మందితో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి వెళ్లి తాను ఏం మాట్లాడాలన్నారు. పీఏసీ సంఖ్యను నాలుగు లేదా ఐదుగురికి కుదించాలని ఆయన కోరారు.

Latest Videos

undefined

 తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్  కాంగ్రెస్ పార్టీలో చేరిక చెల్లకపోతే  దేవరకొండకు చెందిన బిల్యానాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిక చెల్లుబాటు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.  బిల్యానాయక్ గతంలో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. 

also read:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ భేటీ: కీలక విషయాలపై చర్చ

ఇవన్నీ చిన్న విషయాలన్నారు.  మరో వైపు సింగరేణిలో రూ. 20 వేల కోట్ల అవినీతిని తాను బయటపెడతానని చెప్పారు. సింగరేణి మైనింగ్ బ్లాక్ ను అదానీ ప్రతిమ శ్రీనివాసరావుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన విషయమై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పారు.ఈ విషయమై సీబీఐ, ఈడీలకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. మైనింగ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న తాను  ఈ విషయమై లోతుగా పరిశీలించినట్టుగా చెప్పారు.  

ఏప్రిల్ లో ఎన్నికలు రావొచ్చు 

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు రావొచ్చని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక, పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయమై పార్టీలో చర్చించినట్టుగా చెప్పారు. సిరిసిల్లలో రాహుల్ గాంధీ సభ ఏర్పాటు విషయమై చర్చించినట్టుగా చెప్పారు.ఈ సభకు ప్రియాంకా గాంధీని కూడా ఆహ్వానించాలని కోరామన్నారు.  డిసెంబర్ మాసంలోనే అభ్యర్ధులను ప్రకటించనున్నట్టుగా పార్టీ నాయకత్వం తెలిపిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. ఏ ఒక్కరితో అధకారంలోకి రాలేమన్నారు. అందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీలో చేరినంత మాత్రాన టికెట్లు ఇచ్చే అవకాశం ఉండదన్నారు. 
 

click me!