నవంబర్ 5న మౌనం వీడుతా: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Aug 9, 2022, 5:11 PM IST

ఈ ఏడాది నవంబర్ 5న తాను మౌనం వీడుతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. కొన్ని రోజులుగా జగ్గారెడ్డి హైద్రాబాద్ కు దూరంగా ఉన్నారు. నియోజకవర్గానికే జగ్గారెడ్డి పరిమితమయ్యారు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగ్గారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. 


హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ 5న మౌనం వీడుతానని Congress  ఎమ్మెల్యే Jagga Reddy ప్రకటించారు. 
మంగళవారం నాడు ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను జీవిత కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. చెళ్లిపో అనే వరకు తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఆయన తేల్చి చెప్పారు. అదే పరిస్థితి వస్తే తాను స్వంత పార్టీని ఏర్పాటు చేసుకొంటానని చెప్పారు. 

నవంబర్ 5న  తాను మౌనం వీడుతానన్నారు. అదే రోజున Gandhi Bhavan లో మీడియాతో మాట్లాడుతానన్నారు.దేశాన్ని Congress మూడు ముక్కలు చేసిందని  బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  అప్పుడు బండి సంజయ్ పుట్టి ఉంటే దేశ విభజనను అడ్డుకొనే వారా అని ఎద్దేవా చేశారు. నోరుందని ఏది పడితే అది మాట్లాడడం బండి సంజయ్ కు అలవాటైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి కొందరు నేతలు పార్టీని వీడి వెళ్తున్నా కూడా జగ్గారెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదనే విషయమై స్పందించడానికి నిరాకరించారు. 

Latest Videos

undefined

కొన్ని రోజులుగా జగ్గారెడ్డి తన నియోజకవర్గంలోనే ఉంటున్నారు. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశానికి మాత్రం జగ్గారెడ్డి హాజరయ్యారు. Hyderabad లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తన జిల్లాలోని పార్టీ కార్యక్రమాలకు మాత్రమే జగ్గారెడ్డి పరిమితమయ్యారు.  టీపీసీసీ చీఫ్ Revanth Reddy తీరుపై జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. గతంలో Rahul Gandhi వద్ద తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  పార్టీ అంతర్గత వ్యవహరాలపై మీడియా వేదికగా విమర్శలు చేయవద్దని కూడా రాహుల్ గాంధీ హెచ్చరించారు. దీంతో పార్టీ వ్యవహారాల విషయమై  కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం మానేసిన విషయం తెలిసిందే. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.ఈ తరుణంలో సమయం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి పిర్యాదు చేస్తున్నారు. అయితే రేవంత్ర ెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత  పార్టీ క్యాడర్ లో జోష్ వచ్చింది. అంతేకాదు ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరికలు కూడా ప్రారంభయ్యాయి. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు కూడా ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.  ఈ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది.  కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న కీలక విషయాల్లో  జగ్గారెడ్డి స్పందించేవారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలపై జగ్గారెడ్డి నోరు మెదపడం లేదు. నవంబర్ 5న తాను నోరు మెదుపుతానని వ్యాఖ్యానించారు. 

click me!