పాలేరు నుండి పోటీ చేస్తా: తేల్చేసిన వైఎస్ షర్మిల

Published : Mar 24, 2021, 02:33 PM ISTUpdated : Mar 24, 2021, 02:39 PM IST
పాలేరు నుండి పోటీ చేస్తా:  తేల్చేసిన వైఎస్ షర్మిల

సారాంశం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు.

హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు.

బుధవారం నాడు ఆమె ఈ విషయాన్ని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో తనకు పాలేరు  అలాగే అని ఆమె చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఆపలేరని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు బుధవారం నాడు లోటస్ పాండ్ లో షర్మిలతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా నుండి పోటీ  చేయాలని ఆమెను పాలేరుకు చెందిన నేతలు కోరారు.పాలేరు నుండి తాను పోటీ చేస్తానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.  పాలేరు నుండి తాను అసెంబ్లీ నుండి బరిలోకి దిగుతానని ఆమె వారికి హామీ ఇచ్చారు.

తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల సన్నాహలు చేసుకొంటుంది. ఏప్రిల్ 9న కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మంలో సభ ఏర్పాటుకు షర్మిల మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ మేరకుే సభ నిర్వహణకు కూడ అనుమతి తీసుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?