రాజకీయ ద్రోహులను నమ్మొద్దు: తుమ్మల నాగేశ్వరరావు సంచలనం

Published : Mar 16, 2022, 04:19 PM ISTUpdated : Mar 16, 2022, 04:59 PM IST
రాజకీయ ద్రోహులను నమ్మొద్దు: తుమ్మల నాగేశ్వరరావు సంచలనం

సారాంశం

రాజకీయ ద్రోహులను నమ్మొద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  పార్టీ కార్యకర్తలను కోరారు. రాజకీయ శతృవులను నమ్మొచ్చు కానీ, ద్రోహులను నమ్మలేమన్నారు.

ఖమ్మం: రాజకీయ ద్రోహులను నమ్మొద్దని  మాజీ మంత్రి Tummala Nageswara rao కోరారు. బుధవారం నాడు ఖమ్మం జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  మాట్లాడారు.రాజకీయ శతృవులను నమ్మొచ్చు కానీ, రాజకీయ ద్రోహులను నమ్మలేమన్నారు.

  ద్రోహం చేసి పార్టీని ఓడిస్తారని తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యర్ధులపై పరోక్షంగా విమర్శలు చేశారు. ద్రోహన్ని మీరు చూసుకొండి జిల్లా అభివృద్దిని నేను చూసుకొంటానని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. KCR  తో మాట్లాడి జిల్లాను అభివృద్ది చేస్తానని చెప్పారు.మళ్లీ మీ ముందుకు వస్తానని తుమ్మల నాగేశ్వరరావు  తెలిపారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుండి TDP అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ కేబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావు  రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. పాలేరు ఎమ్మెల్యే Ramreddy Venkat Reddy మరణంతో పాలేరు నుండి పోటీ చేసి విజయం సాధించారు.2018 ఎన్నికల్లో  పాలేరు నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.Kandala  Upender Redy ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.

2018 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఏడాదిలో జరిగిన MLC ఎన్నికల సమయంలో ఆయన  యాక్టివ్ గా కన్పించారు.  టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధుసూధన్ రావు విజయం సాధించారు. అయితే  మెజారిటీ తగ్గింది. అయితే పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేశారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం  సీరియస్ అయింది.  

మరో వైపు ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల తో ఇటీవల మాజీ మంత్రి Jupallu Krishna Rao భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్ధుల ఓటమి విషయమై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధులు కొందరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతోనే ఆయనకు 2109 పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది.

రెండు రోజుల క్రితం మధిరలో తన అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు.  మరో వైపు పాలేరు నియోజకవర్గంలో కూడా విస్తృతంా పర్యటించాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు. 

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు  కీలకంగా వ్యవహరించారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో సుదీర్ఘ కాలం మంత్రి పదవిలో ఉన్నారు. గత టర్మ్ లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అయితే 2018 ఎన్నికల్లో ఓటమికి పార్టీలో కొందరు నేతలు వెన్నుపోటు పొడవడమే కారణమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యలు తీసకోవాలని కోరుతున్నారు. పార్ీకి ద్రోహం చేసిన వారిపై చర్యలు తీసకొంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓట్లు తగ్గేవి కావనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?