కేసీఆర్ కు కీడు తలపెట్టే ఆలోచన కలలో కూడా లేదు.. రఘురామకృష్ణంరాజు

By SumaBala BukkaFirst Published Nov 26, 2022, 7:56 AM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కు హాని తలపెట్టాలని తాను కలలో కూడా అనుకోనని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన ప్రమేయం లేదని అన్నారు. 

ఢిల్లీ : వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై  నోరు విప్పారు. అంత పనికిమాలిన పని చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రి కెసిఆర్ కి గాని కీడు చేసే ఆలోచన తనకు కలలో కూడా లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు,  తను ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వానికి కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడింది లేదని అన్నారు. తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతుందని..  అది చూసి  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన  ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి వలస వస్తున్నారని..  తానే స్వయంగా గతంలో పలుసార్లు  చెప్పానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. 

ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా మారిందని  అన్నారు. వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు  శుక్రవారం  ఢిల్లీలో  విలేకరులతో  మాట్లాడారు.  టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన ప్రమేయం లేదని చెప్పారు.  వారిని కొనుగోలు చేయాలన్న  పనికిమాలిన ఆలోచనలు.. తనకు  రావని.. అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై తనకు చాలా ఇష్టం ఉందని…  అలాంటి వ్యక్తి తాను ప్రభుత్వానికి పనిచేయాలని ఎందుకు కోరుకుంటానని అన్నారు. 

తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేయండి..: కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌ డిమాండ్‌

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న చాలా మంది అధికారులు ఎక్కడ ఉన్నారని..  వారిని గుర్తించాలని టిఆర్ఎస్ శ్రేణులకు,  ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయన సూచించారు. తెలంగాణకు చెందిన సిట్  సిఆర్ పిసి 41 కింద తనకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. దీనికి  సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు, ఏపీ సీఎం వైయస్ జగన్ తో ఉన్నట్టుగా తనకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో గొడవలు లేవని ఈ సందర్భంగా తెలిపారు. వైయస్ జగన్మోహన్  రెడ్డి..  తన మాటలు వినే కొంత మంది అధికారులను.. ప్రభావితం చేస్తారని..  వారితో ఇలాంటి పనులు చేయిస్తున్నారని..  రెబల్  ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపణలు గుప్పించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. విచారణకు సహకరించని నందూ భార్య, లాయర్ ప్రతాప్ గౌడ్

 

click me!