టెక్కీ కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Published : Mar 30, 2019, 09:31 AM IST
టెక్కీ కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు  చెలరేగాయి. 

  ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు  చెలరేగాయి. ఆ మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది. కాగా ఆ సాఫ్ట్ వేర్ మాత్రం ప్రమాదవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే విజయ్‌ రాహుల్‌ తన కారులో (టీఎస్‌09ఈజడ్‌7989) శుక్రవారం ఉదయం ఔటర్‌ రింగురోడ్డు వైపు వెళ్తున్నాడు. ఉదయం 10:10గంటల సమయంలో కారు హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీ సమీపంలోకి చేరుకోగానే ఇంజిన్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. 

వెంటనే కారును రోడ్డు పక్కగా నిలిపిన అతడు కారు లోంచి దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu