ఆ టెక్కీ దొంగగా ఎందుకు మారాడంటే.....

By narsimha lodeFirst Published Oct 30, 2018, 1:05 PM IST
Highlights

తన కుటుంబాన్ని పోషించేందుకు  బ్యాంకు దోపీడీకి పాల్పడేందుకు ప్రయత్నించిన  మాజీ టెక్కీని స్థానికులు  వెంటాడి పట్టుకొన్నారు

హైదరాబాద్: తన కుటుంబాన్ని పోషించేందుకు  బ్యాంకు దోపీడీకి పాల్పడేందుకు ప్రయత్నించిన  మాజీ టెక్కీని స్థానికులు  వెంటాడి పట్టుకొన్నారు. కుటుంబ పోషణ కోసం  బ్యాంకు దోపీడీకి ప్రయత్నించి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు  ఆ మాజీ టెక్కీ. ఈ ఘటన హైద్రాబాద్ మణికొండలోని కరూర్ వైశ్యా బ్యాంకులో సోమవారం నాడు చోటు చేసుకొంది.

డేవిడ్ ప్రవీణ్ అనే వ్యక్తి  గతంలో  విప్రోలో సాఫ్ట్‌వేర్  ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అయితే అతను ఉద్యోగం మానేశాడు.తన కుటుంబాన్ని పోషించేందుకు గాను  ప్రవీణ్ హైద్రాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఓయూ కాలనీ కరూర్ వైశ్యాబ్యాంకు  దోపీడీకి ప్లాన్ చేశాడు.

సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో  కరూర్ వైశ్యా బ్యాంకు మేనేజర్  కె.ఎల్ మహేంద్ర ఛాంబర్‌లోకి వెళ్లి  బొమ్మ తుపాకీతో  ఆయనను బెదిరించాడు. బ్యాంకులోకి వెళ్లే  సమయంలో బుర్ఖా ధరించి వెళ్లాడు.

బొమ్మ తుపాకీతో బెదిరించడంతో  బ్యాంకు మేనేజర్  తన క్యాబిన్ నుండి భయంతో పరుగులు తీశాడు.  వెంటనే తన సహ ఉద్యోగులను  ఆయన అలర్ట్ చేశారు. అయితే తన తుపాకీతో  ప్రవీణ్ అందరినీ బెదిరించాడు. సినిమాలో చూపినట్టుగా కింద పడుకోవాలని హెచ్చరించాడు.

క్యాషియర్ శివకుమార్‌ను బెదిరింది అతని వద్ద ఉన్న రూ.2.5 లక్షలను తీసుకొని బ్యాంకు నుండి పారిపోయాడు. అయితే  బ్యాంకులో ఉన్న ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది ప్రవీణ్ వెంటపడ్డారు. 

అతడు బైక్ పై  వెళ్తుండగా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బాంబుతో దాడి చేస్తానని  ప్రవీణ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడ జనం రాళ్ల దాడిని ఆపలేదు. రాళ్ల దాడిలో ప్రవీణ్ తలకు గాయం కావడంతో మార్గమధ్యంలోనే కారు వెనుక నక్కాడు. ఈ సమయంలో జనమంతా ప్రవీణ్ ను చుట్టుముట్టి చితకబాదారు. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

తుపాకీతో బ్యాంకులో చొరబడ్డ దుండగుడు...దోపిడీకి యత్నం

 

 

click me!