ఇంటి చుట్టూ వరద నీరు, ఇంట్లో వృద్దులు: కాపాడిన పోలీసులు

Published : Oct 18, 2020, 03:57 PM IST
ఇంటి చుట్టూ వరద నీరు, ఇంట్లో వృద్దులు: కాపాడిన పోలీసులు

సారాంశం

హైద్రాబాద్‌లో  భారీ వర్షాల కారణంగా  వరద నీటిలో చిక్కుకొన్న  ఇద్దరు వృద్దులను పోలీసులు ఆదివారం నాడు సురక్షితంగా రక్షించారు.  

హైదరాబాద్: హైద్రాబాద్‌లో  భారీ వర్షాల కారణంగా  వరద నీటిలో చిక్కుకొన్న  ఇద్దరు వృద్దులను పోలీసులు ఆదివారం నాడు సురక్షితంగా రక్షించారు.

భారీ వర్షం కారణంగా సరూర్ నగర్ చెరువుకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. ఎగువ ప్రాంతం నుండి  వరద నీరు సరూర్ నగర్ చెరువులోకి రావడంతో తూముల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.దీంతో సరూర్ నగర్ చెరువు దిగువ ప్రాంతంలోని  వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఇద్దరు వృద్దులు తమ ఇంట్లో చిక్కుకుపోయారు.

also read :అమీన్‌పూర్ ఆనంద్ విషాదాంతం: ఐదు రోజుల తర్వాత కారులో దొరికిన డెడ్‌బాడీ

చుట్టూ వరద నీరు చేరడంతో వృద్దులు ఎటూ వెళ్లాలో తెలియని పరిస్థితి  నెలకొంది.ఈ విషయం తెలిసిన సరూర్ నగర్ పోలీసులు వృద్దులను రక్షించారు.జేసీబీ సహాయంతో ఇంటిపైకి వెళ్లి వృద్దులను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి వారిని తరలించారు.నీటిలో చిక్కుకొన్నవారిని కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు. 

PREV
click me!

Recommended Stories

Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే