రాజేష్ శరీరంపై గాయాలు: వివాహేతర సంబంధం కారణమా?

By narsimha lode  |  First Published May 30, 2023, 11:34 AM IST

హైద్రాబాద్  హయత్ నగర్ కుంట్లూరు శివారులో  రాజేష్ అనుమానాస్పద  స్థితిలో  మృతి చెందడంపై   పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 



హైదరాబాద్: నగర శివారులోని  హయత్ నగర్  కుంట్లూరు వద్ద  రాజేష్ అనే  బీటెక్ విద్యార్థి  అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రాజేష్  మృతదేహంపై గాయాలున్నాయి.  రాజేష్ ను కొట్టి  చంపారా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  రాజేష్  చివరగా  ఓ మహిళతో ఫోన్ లో మాట్లాడినట్టుగా  పోలీసులు గుర్తించారు.    రాజేష్ చివరిసారిగా మాట్లాడిన  మహిళ  ఎవరనే విషయమై ఆరా తీస్తున్నారు.

ములుగు  జిల్లాకు  చెందిన  రాజేష్  రంగారెడ్డి జిల్లాకు  చెందిన హయత్ నగర్  కుంట్లూరు  వద్ద అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.. రాజేష్ మృతదేహం  కుళ్లిపోయిన స్థితిలో  ఉంది.  ఈ నెల 29న  ఈ డెడ్ బాడీ  విషయం వెలుగు చూసింది. మృతదేహం పక్కనే దుస్తులున్నాయి.  అంతేకాదు కండోమ్ ప్యాకెట్ కూడ గుర్తించారు  పోలీసులు.  

Latest Videos

రాజేష్ మృతికి  గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.    ఈ నెల  24న  ఎల్ బీ నగర్ లో   ప్రభుత్వ టీచర్  సుజాత  పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నం  చేసింది.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఆమె  మృతి చెందింది.   రాజేష్  మృతికి,  టీచర్  ఆత్మహత్యాయత్నానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడ  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  

తన భార్యను ట్రాప్  చేసి ఉంటారని  ప్రభుత్వ టీచర్ సుజాత  భర్త నాగేశ్వరరావు  ఆరోపించారు.  తన భార్య ఆత్మహత్య  విషయమై పోలీసులకు  ఫిర్యాదు  చేస్తానన్నారు.ఈ  నెల  24వ తేదీ వరకు  స్నేహితులతో రాజేష్ టచ్ లో ఉన్నాడు. ఆ తర్వాత నుండి  రాజేష్  స్నేహితులు, సోదరులతో కూడ టచ్ లో లేకుండా పోయాడు.   కుంట్లూరులో  అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రాజేష్  నాలుగైదు రోజుల క్రితం  మృతి చెంది ఉండొచ్చని  పోలీసులు అనుమానిస్తున్నారు.   రాజేష్ మృతదేహన్ని పోస్టుమార్టం  కోసం  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు  పోలీసులు.  రాజేష్  అనుమానాస్పదస్థితి  మృతి వెనుక  వివాహేతర సంబంధం  కారణమా అనే  కోణంలో   కూడ  పోలీసులు దర్యాప్తు   చేస్తున్నారు.

click me!