భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి: కేసు నమోదు

Published : May 24, 2021, 02:37 PM IST
భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి: కేసు నమోదు

సారాంశం

ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  భూ వివాదంలో చిక్కుకొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  భూ వివాదంలో చిక్కుకొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాప్రాలోని 152 సర్వే నెంబర్ లోని 90 ఎకరాల భూమి విషయంలో వివాదం చోటు చేసుకొంది. ఈ విషయమై  ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి  తనను డబ్బులు డిమాండ్ చేశారని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.  ఈ విషయమై బాధితుడికి అనుకూలంగా  కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

  ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని  కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై  కేసు నమోదు చేశారు.  ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు  కాప్రా ఎమ్మార్వో గౌతం కుమార్ పై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలతో మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ తప్పించారు. ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారిని మంత్రి మల్లారెడ్డి డబ్బులు డిమాండ్ చేశారనే ఓ ఆడియో సంభాషణ గత మాసంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే తాను ఎవరిని కూడ డబ్బులు డిమాండ్ చేయలేదని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తాను మాట్లాడినట్టుగా ఎవరో మాట్లాడారని మల్లారెడ్డి ఆ సమయంలో ప్రకటించారు.


 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!