మారేడ్ పల్లి ఇన్స్ పెక్టర్ నాగేశ్వరరావు పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తనను రేప్ చేశారని, అడ్డు వచ్చిన తన భర్తను కొట్టాడని, తమని చంపేయబోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై రేప్, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి.
మారేడ్ పల్లి ఎన్స్ పెక్టర్ నాగేశ్వరరావుపై రేప్ కేసు నమోదైంది. దీంతో పాటు హత్యాచారం, కిడ్నాప్ కేసులు కూడా నమోదయ్యాయి. 32 ఏళ్ల మహిళా బాధితురాలు పోలీసు ఇన్స్ పెక్టర్ పై ఫిర్యాదు మేరకు పోలీసులు వీటిని నమోదు చేశారు.
ఖమ్మంలో వింత చేపల వర్షం.. ఆసక్తిగా గమనిస్తున్న స్థానికులు..
ఫిర్యాదు చేసిన మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు ఇన్స్పెక్టర్ తనను రేప్ చేశారని తీవ్రంగా ఆరోపించింది. దీనికి అడ్డువచ్చిన తన భర్త తలపగులగొట్టారని పేర్కొంది. ఆ తర్వాత తమ ఇద్దరినీ చంపేందుకు పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని బయటకు తీసుకెళ్లారని తెలిపారు. అయితే ఇబ్రహీంపట్నంలో వాహనానికి యాక్సిడెంట్ అయ్యిందని, దీంతో తమ ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు. ఒక వేళ కారుకు ప్రమాదానికి గురి కాకుండా ఉంటే ఇన్స్ పెక్టర్ తమను ఇద్దరినీ చంపేసి ఎక్కడో పడేసి ఉండేవాడని ఆరోపించారు. ఈ నిజాలు ఎప్పటికీ బయటకు వచ్చేవి కావని అన్నారు. కాగా నిందితుడిపై తెల్లవారుజామున వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది.