రియల్ ఏస్టేట్‌లో మోసాలు:హైద్రాబాద్ లో సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్

By narsimha lode  |  First Published Dec 2, 2022, 7:37 PM IST

సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట్  చేశారు. 
 


హైదరాబాద్: సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట్  చేశారు. రియల్ ఏస్టేట్  పేరుతో  మోసాలు  చేశారని లక్ష్మీనారాయణపై  కేసు నమోదైంది..సీసీఎస్‌లో నమోదైన కేసులో  పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్ట్  చేశారు.సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయని సాహితీ ఇన్ ఫ్రా సంస్థ.దీంతో బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరో ప్రాజెక్టులో  రూ. 900 కోట్లు వసూలు చేశారని సాహితీ ఇన్ ఫ్రా సంస్థపై  ఆరోపణలున్నాయి.ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో  సాహితీ ఇన్ ఫ్రా సంస్థ మోసాలకు పాల్పడిందని  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. భారీ భవనాల పేరుతో డబ్బులను ఈ సంస్థ వసూలు చేసినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు.రియల్ ఏస్టేట్ పేరుతో  లక్ష్మీనారాయణ మోసం చేశారని కేసు నమోదైంది.1700 మంది బాధితుల నుండి రూ. 539 కోట్లు వసూలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. లక్ష్మీనారాయణ టీటీడీ బోరడ్డు సభ్యుడిగా ఉన్నారు. 

Latest Videos

click me!