ఆందోళన చేస్తున్నవారిపై చర్యలు: కాంట్రాక్టు ఉద్యోగులకు హైద్రాబాద్ మెట్రో మేనేజ్ మెంట్ వార్నింగ్

By narsimha lodeFirst Published Jan 3, 2023, 12:35 PM IST
Highlights

కాంట్రాక్టు  ఉద్యోగులు  తప్పుడు ప్రచారం చేస్తున్నారని  హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది.  ధర్నా చేస్తున్నవారిపై చర్యలు తీసుకొంటామని హైద్రాబాద్  మెట్రో యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది.

హైదరాబాద్:   కాంట్రాక్టు ఉద్యోగుల చేస్తున్న ప్రచారంలో  వాస్తవం లేదని  హైద్రాబాద్  మెట్రో రైలు యాజమాన్యం  ప్రకటించింది.  తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ మెట్రో లో పనిచేస్తున్న  కాంట్రాక్టు  సిబ్బంది  మంగళవారం నాడు  సమ్యెకు దిగారు.  తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు.  అమీర్ పేట  వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు  ధర్నాకు దిగారు.  కాంట్రాక్టు ఉద్యోగుల  సమస్యలను చర్చిస్తామని  హైద్రాబాద్ మెట్రో  యాజమాన్యం తెలిపింది.. 
టికెటింగ్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సమ్మె కారణంగా రైళ్ల  రాకపోకల విషయంలో ఎలాంటి అంతరాయం  ఏర్పడలేదని  మెట్రో రైలు యాజమాన్యం ప్రకటించింది. ధర్నాకు దిగిన మెట్రో కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకొంటామని  హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం  హెచ్చరించింది. హైద్రాబాద్ మెట్రో రైళ్లు నడిచేలా తగినంత సిబ్బంది ఉన్నారని హైద్రాబాద్ మెట్రో రైలు తేల్చి చెప్పింది.  కాంట్రాక్టు ఉద్యోగులకు  తగిన సౌకర్యాలు, ప్రయోజనాలు అందేలా చూస్తామని  కూడా  హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం హామీ ఇచ్చింది. 

alsop read:హైద్రాబాద్ మెట్రోలో సమ్మె: వేతనాల కోసం స్ట్రైక్ చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు

తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ  హైద్రాబాద్ మెట్రో  లో పనిచేస్తున్న  కాంట్రాక్టు ఉద్యోగులు ఇవాళ ఉదయం నుండి  సమ్మెలోకి దిగారు.  ఎల్ బీ నగర్ మియాపూర్ రూట్ లో  హైద్రాబాద్ మెట్రోలో పనిచేస్తున్న  కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.  కొత్తగా విధుల్లోకి చేరినవారితో పాటు  ఐదేళ్ల నుండి విధులు నిర్వహిస్తున్న వారికి కూడా ఒకే వేతనం ఇవ్వడంపై కాంట్రాక్టు ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.   కాంట్రాక్టు ఉద్యోగులకు కేవలం  రూ. 11 వేలు వేతనం ఇస్తున్నారన్నారు.  అంతేకాదు  కనీసం ఐదు నిమిషాలు ఆలస్యమైనా  విధులకు అబ్సెంట్  వేస్తున్నారని  చెబుతున్నారు.తమ సమస్యలను హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయిందంటున్నారు. దీంతో  ఇవాళ  ఆందోళనకు దిగినట్టుగా  కాంట్రాక్టు  ఉద్యోగులు  ప్రకటించారు.  
 
 

click me!