బీజేపీ‌కి షాకిచ్చిన టీఆర్ఎస్.. మోదీ హైదరాబాద్‌కు వస్తున్న వేళ కేసీఆర్ మార్క్ ప్లాన్‌తో కౌంటర్..!

By Sumanth KanukulaFirst Published Jun 27, 2022, 11:04 AM IST
Highlights

జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అయితే బీజేపీకి టీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కనిపించేలా సీఎం కేసీఆర్ వ్యుహాలు రచించారు. 

తెలంగాణ అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే తాము తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేసేలా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది. జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా జూలై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. 

దీంతో హైదరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం సాగించాలని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఏ పార్టీ అయినా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తుంటాయి. అయితే బీజేపీకి టీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు సాగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోదీ సభ నేపథ్యంలో.. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లకు అవకాశం లేకుండా టీఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ.. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కనిపించేలా టీఆర్ఎస్ వ్యుహాలు రచించింది. నగరంలో టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉండేలా ప్లాన్ చేసింది. అంతేకాకుండా మెట్రో పిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలిపేలా  ప్రకటనలతో నింపేయనుంది. హోర్డింగ్స్‌లో కేసీఆర్ ఫొటో ఉండేలా.. రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి, రైతు భీమా తదితర పథకాలను ప్రచారం చేయనుంది. ఇందుకోసం.. ఎల్ అండ్ టీ, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ‌లతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రోజులతో పాటు.. అందుకు ముందు, వెనకాల రెండు రోజుల్లో(మొత్తం వారం రోజులు)  తమ ప్రకటనల కోసం ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని తెలుస్తోంది. మరోవైపు నగరంలోని బస్టాప్‌లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ సా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇతర బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌‌కు వస్తున్న వేళ రాజకీయంగా కేసీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. పక్కా వ్యుహాంతో బీజేపీ నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించకుండా.. ఎటు చూసినా టీఆర్ఎస్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచారమే కనిపించనుంది. మరి దీనికి కౌంటర్‌గా బీజేపీ ఏమి చేస్తుందో వేచిచూడాలి.   
 

click me!