ఆందోళన విరమణ: సాయంత్రం మరోసారి మెట్రో అధికారులతో కాంట్రాక్టు ఉద్యోగుల చర్చలు

By narsimha lode  |  First Published Jan 3, 2023, 2:03 PM IST

తమకు వేతనాలు పెంచాలని డిమాండ్  చేస్తూ  హైద్రాబాద్ మెట్రో రైలు కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు  ఇవాళ  సమ్మె బాట పట్టారు.  హెచ్ఎంఆర్ తో  చర్చల తర్వాత ఆందోళన విరమించారు.
 


హైద్రాబాద్ మెట్రో రైలులో  పనిచేస్తున్న  కాంట్రాక్టు  ఉద్యోగులు తాత్కాలికంగా  ఆందోళనను విరమించారు. ఇవాళ  సాయంత్రం  మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్: హైద్రాబాద్ మెట్రో రైలులో  పనిచేస్తున్న  కాంట్రాక్టు ఉద్యోగులు  ఆందోళనను విరమించారు.  ఇవాళ మరోసారి  హైద్రాబాద్ మెట్రో యాజమాన్యంతో  కాంట్రాక్టు ఉద్యోగులు చర్చించనున్నారు.  తమ వేతనాలు పెంచాలని డిమాండ్  చేస్తూ  హైద్రాబాద్ మెట్రో లో పనిచేస్తున్న కాంట్రాక్టు  ఉద్యోగులు  ఇవాళ ఉదయం సమ్మెకు దిగారు. అమీర్ పేట వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు  ధర్నాకు దిగారు  

also read:ఆందోళన చేస్తున్నవారిపై చర్యలు: కాంట్రాక్టు ఉద్యోగులకు హైద్రాబాద్ మెట్రో మేనేజ్ మెంట్ వార్నింగ్

Latest Videos

ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో  ఇవాళ మధ్యాహ్నం హైద్రాబాద్ మెట్రో  యాజమాన్యం చర్చలు జరిపింది. హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం  కాంట్రాక్టు ఉద్యోగులకు చెందిన ఐదుగురు ప్రతినిధులతో  చర్చించింది.  సుమారు గంటపాటు  హెచ్ఎంఆర్ ప్రతినిధులు  కాంట్రాక్టు ఉద్యోగులతో చర్చించారు.  తమ డిమాండ్లను  హెైద్రాబాద్ మెట్రో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు కాంట్రాక్టు ఉద్యోగులు.  ఇవాళ సాయంత్రం మరోసారి చర్చలు జరపాలని ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. సాయంత్రం చర్చలు జరపాలని నిర్ణయం తీసుకోవడంతో  అమీర్ పేట మెట్రో రైలుస్టేషన్ వద్ద ఆందోళనను  విరమించారు.

ఎల్బీనగర్ మియాపూర్ రూట్ లోని  27 స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోనలో పాల్గొన్నవారిపై  చర్యలు తీసుకుంటామని హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. కాంట్రాక్టు  ఉద్యోగులు   తప్పుడు ప్రచారం చేస్తున్నారని  కూడా  హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది.కాంట్రాక్టు  ఉద్యోగులకు మౌలిక వసతులు సహా ఇతర సదుపాయాలు  కల్పిస్తామని కూడా  హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం   హామీ ఇచ్చింది.  
 

click me!