రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్ మెట్రో

Published : Aug 18, 2018, 09:54 AM ISTUpdated : Sep 09, 2018, 01:36 PM IST
రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్ మెట్రో

సారాంశం

మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య లక్షణంగా ‘లక్ష’దాటింది. ఈ నెల 16న నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌ మార్గంలో ప్రయాణించిన వారి సంఖ్య 1.07 లక్షలుగా ఉందని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైలు రికార్డులు సృష్టిస్తుంది. నగరానికి మెట్రో రావాలని నగరవాసులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరపడుతూ.. గతేడాది మెట్రో ప్రారంభం అయ్యింది. అయితే.. మెట్రో ఛార్జీల ధరలు అధికంగా ఉండటంతో.. ఎక్కువగా మెట్రోలో ప్రయాణించడానికి ప్రజలు ఆసక్తి చూపడంలేదనే ప్రచారం మొదలైంది. అయితే.. అదంతా వట్టిదే అని తేలింది.

మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య లక్షణంగా ‘లక్ష’దాటింది. ఈ నెల 16న నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌ మార్గంలో ప్రయాణించిన వారి సంఖ్య 1.07 లక్షలుగా ఉందని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

రోజురోజుకూ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని..మెట్రో రూట్లలో క్రమంగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌ మొదటివారంలో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో మెట్రో ప్రారంభం కానుండటంతో ఈ మార్గంలో నిత్యం 2.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో కమిషనర్‌ ఆఫ్‌ రైల్వేసేఫ్టీ నుంచి భద్రతా ధ్రువీకరణ పత్రం అందనుందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే