జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ కాల్పుల కేసు : మృతుల్లో హైదరాబాదీ.. ఆదుకోవాలంటూ కేటీఆర్‌కు ఒవైసీ విజ్ఞప్తి

Siva Kodati |  
Published : Aug 01, 2023, 08:28 PM IST
జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ కాల్పుల కేసు : మృతుల్లో హైదరాబాదీ.. ఆదుకోవాలంటూ కేటీఆర్‌కు ఒవైసీ విజ్ఞప్తి

సారాంశం

జైపూర్-ముంబై రైలులో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు. ఈ విషయాన్ని మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. 

జైపూర్-ముంబై రైలులో కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌కు సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు. ఈ విషయాన్ని మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. నాంపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన సయ్యద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారని.. ఆఖరి బిడ్డకు ఆరు నెలల వయసే వుంటుందని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. సయ్యద్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించడంలో నాంపల్లి ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌ను అసదుద్దీన్ ఒవైసీ కోరారు.

కాగా.. సోమవారం జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏఎస్ఐ టికా రామ్ మీనాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆపై దహిసర్ స్టేషన్ వద్ద చేతన్ సింగ్ పారిపోయాడు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై అతనిని పట్టుకున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ