పాక్ చెరలో హైద్రాబాద్ యువకుడు: నిఘా వర్గాల ఆరా

By narsimha lodeFirst Published Nov 19, 2019, 7:47 AM IST
Highlights

పాకిస్తాన్ దేశంలో అక్రమంగా ప్రవేశించారనే నెపంతో ఇద్దరు ఇండియన్లను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ కు చెందిన ప్రశాంత్,మద్యప్రదేశ్ కు చెందిన దరీలాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ కు చెందిన  ప్రశాంత్ అనే యువకుడిని పాకిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తమ దేశంలోకి వీరు అక్రమంగా ప్రవేశించినట్టుగా పాకిస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవాల్‌పూర్‌లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్ పోలీసులు ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ గా గుర్తించారు. మరో వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన దరీలాల్‌గా గుర్తించారు. 

వీరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీంతో తమ దేశంలో ప్రత్యేక ఆపరేషన్ కు భారత్ కుట్ర పన్నిందని పాక్ ఆరోపిస్తోంది. ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రశాంతేనని.. అతడు 2017 నుంచి కనిపించట్లేదని సమాచారం. 

ఆ యువకుడు తెలుగులో మాట్లాడిన 1.03 నిమిషాల నిడివి గల వీడియో సైతం హల్‌చల్‌ చేస్తోంది. అందులో అతడి వెనుక ముస్తాఫా అనే పేరు గల నేమ్‌ప్లేట్‌తో ఆకుపచ్చ రంగు యూనిఫాంలో ఒకరు నిల్చుని ఉన్నారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రశాంత్‌ ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాయి.

ప్రశాంత్ అనే యువకుడు అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ప్రశాంత్ అనే యువకుడు తెలుగులో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మమ్మీ డాడీ బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉంది. నన్ను ఇప్పుడు పోలీసుస్టేషన్‌ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఏ ప్రాబ్లం లేదని డిక్లేర్‌ అయిన తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి జైలుకు తీసుకెళ్తారు. 

అక్కడ నుంచి వాళ్లు ఇండియన్‌ ఎంబసీకి సమాచారమిస్తారు. జైలుకెళ్లాక బెయిల్‌ ప్రాసెస్‌ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్‌ చెయ్యడం అవుతుంది. ఇండియా వాళ్లు, పాకిస్తాన్‌ వాళ్లు ఎక్స్‌చేంజ్‌ చేసుకుంటారు. 

దీనికి ఓ నెల వరకు పడుతుంది. ఇప్పుడు కోర్టులో ఉన్నా.. జైలుకు వెళ్లిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్‌ చెయ్యడానికి అవకాశం ఉంటుందంటూ ఆ వీడియోలో ప్రశాంత్ మాట్లాడినట్టుగా ఉంది.అసలు ప్రశాంత్ ఎవరు, పాకిస్తాన్ లోకి ఎలా ప్రవేశించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైద్రాబాద్ కు చెందిన ప్రశాంత్ ను పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్టుగా అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వాస్తవానికి ప్రశాంత్ హైద్రాబాద్ కు చెందినవాడేనా, ప్రశాంత్ కుటుంబసభ్యులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వచ్చిన తర్వాతే ఈ విషయమై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.ప్రశాంత్ హైద్రాబాద్ నుండి పాకిస్తాన్ లోకి ఎందుకు ప్రవేశించేందుకు ప్రయత్నించాడనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. 


 

click me!