పుట్టింటికి వెళ్లనివ్వని భర్త.. భార్య ఆత్మహత్య

Published : Sep 03, 2018, 02:06 PM ISTUpdated : Sep 09, 2018, 01:25 PM IST
పుట్టింటికి వెళ్లనివ్వని భర్త.. భార్య ఆత్మహత్య

సారాంశం

అతను ఇంటికి ఉన్న కిటికీలో నుంచి తొంగి చూడగా.. ఆమె ఆత్మహత్య చేసుకొని కనిపించింది. వెంటనే వీరేందర్ కి విషయం తెలియజేశాడు.

పుట్టింటికి వెళ్లానన్న భార్యను అడ్డుకున్న ఓ భర్త.. ఆమెను గదిలో పెట్టి తాళం వేశాడు. అది భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో చోటుచేసుకుంది. 

నల్లకుంట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహబూబ్ నగర్ జిల్లా నేలకొండకు చెందిన తేజ్ వత్ స్నేహ కి నగరానికి చెందిన వీరేందర్ తో వివాహం జరిగింది. శనివారం ఉదయం స్నేహ.. తన పుట్టింటికి వెళ్లడానికి భర్తను అనుమతి కోరింది. అందుకు అతను నిరాకరించాడు. అంతేకాకుండా ఆమెను ఇంట్లో బంధించి.. డ్యూటీకి వెళ్లిపోయాడు. అతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. 

దీంతో మనస్థాపానికి గురైన స్నేహ ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. డ్యూటీకి వెళ్లిన వీరేందర్.. తన భార్య ఎలా ఉందో తన స్నేహితుడిని చూడాల్సిందిగా ఆదేశించాడు. అతను ఇంటికి ఉన్న కిటికీలో నుంచి తొంగి చూడగా.. ఆమె ఆత్మహత్య చేసుకొని కనిపించింది. వెంటనే వీరేందర్ కి విషయం తెలియజేశాడు.

స్నేహ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి.. ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. భర్త వీరేందర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌