ఫైవ్ స్టార్ హోటల్ పార్క్ హయత్ కి...జీహెచ్ఎంసీ షాక్

Published : Feb 06, 2019, 12:21 PM IST
ఫైవ్ స్టార్ హోటల్ పార్క్ హయత్ కి...జీహెచ్ఎంసీ షాక్

సారాంశం

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని పార్క్ హయత్, రోడ్డు నెంబర్ 1లోని హయత్ లకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. 

ఒకే ఫ్రిడ్జ్ లో వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కలిపి పెట్టినందుకు ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి  భారీ జరిమానా విధించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని పార్క్ హయత్, రోడ్డు నెంబర్ 1లోని హయత్ లకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. ఒక హోటల్ కి రూ.50వేలు.. మరో హోటల్ కి రూ.20వేలు జరిమానా విధించారు. ఈ రెండు హోటల్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ని ఒకే ఫ్రిడ్జ్ లో పెట్టడం గమనార్హం. నిబంధనల ప్రకారం.. అలా పెట్టడం నేరం అందుకే జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

అంతేకాకుండా ఈ హోటల్స్ లో బ్యాన్ చేసిన ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని.. హోటల్ కి కనీసం కంపోసింగ్ యూనిట్ కూడా లేదని అధికారులు చెప్పారు. హోటల్ కి కంపోసింగ్ యూనిట్ ఉండటం తప్పనిసరి అని.. ఈ రూల్స్ అన్నీ పాటించని కారణం చేత జరిమానా విధించినట్లు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!