శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన భారీ ముప్పు

Published : Jul 23, 2019, 11:19 AM ISTUpdated : Jul 23, 2019, 11:21 AM IST
శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన భారీ ముప్పు

సారాంశం

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రన్ వేపై వెళ్తుండగా.... విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది.  పైలెట్ దీనిని గుర్తించి అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.

శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఇండిగో విమానానికి భారీ ముప్పు తప్పింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రన్ వేపై వెళ్తుండగా.... విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది.  పైలెట్ దీనిని గుర్తించి అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.

ఈ ఘటన సంభవించిన సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విమనంలోని ప్రయాణికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. లోపాన్ని తర్వాత సరిచేశారు. కాగా... ఈ ఘటన జరిగిన రెండు గంటల అనంతరం ప్రయాణికులను వేరే విమానంలో గమ్యస్థానానికి చేర్చారు. ఈ సమస్య చాలా సర్వసాధారణమైనదిగా ఇండిగో సిబ్బంది చెప్పడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్