అమిత్ షాతో భేటీ... బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్

Published : Jul 23, 2019, 09:49 AM ISTUpdated : Jul 23, 2019, 02:28 PM IST
అమిత్ షాతో భేటీ... బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్

సారాంశం

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే వివేక్ కషాయ రంగు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివేక్ ఢిల్లీ చేరుకోగా... మరికాసేపట్లు బీజేపీలో చేరనున్నారు.

మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరగుతోంది. మంగళవారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో టచ్ లో ఉంటున్నారని... ఈరోజు అధికారికంగా ఆయన కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం.

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే వివేక్ కషాయ రంగు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివేక్ ఢిల్లీ చేరుకోగా... మరికాసేపట్లు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వివేక్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కరీంగనర్ ఎంపీ టికెట్ ఆశించారు. కాగా.... కేసీఆర్ ఆ టికెట్ వివేక్ కాకుండా మరొకరికి కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్... అప్పటి నుంచి పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ కి రాజీనామా కూడా చేసేశారు.

ఇదిలా ఉంటే... తెలుగు రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి దూరమైన వివేక్ ని తమ పార్టీలోకి ఆహ్వానించింది. దానికి ఆయన కూడా సంఘీభావం తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu