జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి: ఈ నెల 22న బాధ్యతల స్వీకరణ

Published : Feb 16, 2021, 10:48 AM IST
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి: ఈ నెల 22న బాధ్యతల స్వీకరణ

సారాంశం

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి  ఈ నెల 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. 

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి  ఈ నెల 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 11వ తేదీన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మన్నె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. 

జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం ముగిసింది.ఈ నెల 22వ తేదీన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 22వ తేదీన మంచి ముహుర్తం ఉండడంతో  మేయర్ గా బాధ్యతలు స్వీకరించాలని విజయలక్ష్మి భావిస్తున్నారు.

కార్పోరేటర్లుగా అమావాస్య రోజునే వీరంతా ప్రమాణం చేశారు. సుమారు 18 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న విజయలక్ష్మి  అమెరికా పౌరసత్వాన్ని వదిలేసి 2007లో హైద్రాబాద్ కు తిరిగి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

School Holidays: కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్